సినిమా హీరోయిన్స్ ఈ రోజుల్లో ఎక్కువగా కాలం ఉండడం అనేది అంత సాధారణమైన విషయం కాదు. హిట్టు రాకపోతే మళ్ళీ కనిపించడం కష్టమే. అయితే జయాపజయాలతో సంబంధం లేకుండా గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాలో అవకాశాలను అందుకుంటున్న బ్యూటీల్లో శ్రియ మొదటి స్థానంలో ఉందనే చెప్పాలి. 

అమ్మడి నడవడికలో తేడా వచ్చినా అందంలో తేడా వచ్చినా అభినయంలో మాత్రం తన స్థాయిని పెంచుకుంటూనే ఉంది. సినిమా సినిమాకు సరికొత్త గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది. ఇకపోతే రీసెంట్ గా ఈ బ్యూటీకి సంబందించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వైట్ స్టైలిష్ డ్రెస్ లో అమ్మడు ఘాటు అందాలను రొమాంటిక్ మోడ్ లో ప్రజెంట్ చేసింది. 

పెళ్లి తరువాత కూడా శ్రియాలో ఏ మాత్రం మార్పు లేదని నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్న కూడా అదే గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తుందో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా శ్రియ కథానాయకుడులో 'చిత్రం భళారే విచిత్రం' సాంగ్ లో ప్రభగా స్టెప్పులేసి అలరించిన సంగతి తెలిసిందే.