పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా.. షకలక శంకర్ పై శ్రీరెడ్డి ఫైర్!

First Published 4, Jul 2018, 4:00 PM IST
srireddy warning to shakalaka shankar
Highlights

కొద్దిరోజుల క్రితం వరకు కూడా అన్ని ఛానెల్స్ లో హాట్ టాపిక్ గా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిన తరువాత ఆమె సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది. తరచూ ఏవోక కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది

 

కొద్దిరోజుల క్రితం వరకు కూడా అన్ని ఛానెల్స్ లో హాట్ టాపిక్ గా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ జోలికి వచ్చిన తరువాత ఆమె సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైంది. తరచూ ఏవోక కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా కమెడియన్ షకలక శంకర్ పై విరుచుకుపడింది. అతడికి తన స్టైల్ లో వార్నింగ్ కూడా ఇచ్చింది. 

''ఇప్పటివరకు నేను ఎదగడానికి, ఫేమస్ అవ్వడానికి ఎవరి పేరును వాడుకోలేదు. నా ఎదుగుదల కోసం పక్క వారిపై ఆధారపడలేదు. కానీ ఇప్పుడు ఒక హీరో భక్తులు బయలుదేరారు. ఆ హీరోకి తెలుసో తెలియదో గానీ అతడి పేరు చెప్పుకొని అతడు రాజకీయంగా రాణించాలి అంటూ అతడిపై బ్రతికేస్తున్నారు. తన సినిమా పబ్లిసిటీ కోసం అతడి ఫ్యాన్స్ ను కూడా వాడేస్తున్నారు. మీ పబ్లిసిటీ కోసం వేరొకరి పేరుని వాడుకోవడం కరెక్ట్ కాదు.. పైగా నా పేరు మధ్యలో తీసుకొస్తున్నారు. ఇకపై అలా చేస్తే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా.. అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఏదేదో వాగుతున్నావనే విషయం నా వరకు వచ్చింది. కమెడియన్ నుండి హీరోగా సినిమా చేశావు. నువ్వేం గొప్పోడివి కాదు.. నీ ప్రొడ్యూసర్ కూడా పెద్ద గొప్పోడు కాదు. మీ కథలు, మీ ప్రొడ్యూసర్ కథలు కూడా బయటకు వస్తాయి. మీ సినిమాల పబ్లిసిటీ కోసం పెద్ద హీరోల పేర్లు తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నావ్.. నా పేరు వచ్చిందంటే మాత్రం మర్యాదగా ఉండదు. అప్పుడొకసారి మర్యాద లేకుండా ఏకవచనంతో మాట్లాడావ్.. ప్రతిఒక్కరికీ టైమ్ వస్తాది. వెయిట్ అండ్ సీ'' అంటూ షకలక శంకర్ కు వార్నింగ్ ఇచ్చింది. 

 

loader