ఇండియన్ ఐడల్ పై నటి శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్

First Published 6, Apr 2018, 8:35 AM IST
srireddy sensational comments on indian idol sriram chandra
Highlights
శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

గత కొంత కాలంగా టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై సంచలన విషయాలు వెల్లడిస్తున్న నటి శ్రీరెడ్డి.. తాజాగా మరో బాంబ్ పేల్చింది. గతంలో వచ్చిన సుచీలీక్స్ తరహాలోనే ఇపుడు టాలీవుడ్ లో `శ్రీ రెడ్డి`లీక్స్ పెను దుమారం రేపుతున్నాయి. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములనుద్దేశించి శ్రీరెడ్డి పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేయడం...ఆ వ్యాఖ్యలకు శేఖర్ కమ్ముల కూడా పరోక్షంగా కౌంటర్ ఇవ్వడం జరిగాయి. ఆ తర్వాత తాను శేఖర్ కమ్ములనుద్దేశించి ఆ పోస్ట్ పెట్టలేదని శ్రీరెడ్డి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత `నేచురల్ `హీరో అంటూ.. పేరు ప్రస్తావించకుండా ఓ టాలీవుడ్ హీరోపై కూడా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ గాయకుడు - ఇండియన ఐడిల్ శ్రీరామచంద్రపై కూడా శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.

సింగర్ శ్రీరామచంద్ర తనతో అసభ్యంగా చాట్ చేశాడని శ్రీరెడ్డి ఆరోపించింది. శ్రీరామ చంద్ర తనతో వాట్సాప్ లో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లను తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘మన ఇండియన్ ఐడిల్ చాట్ చూడండి.. శ్రీరామ్ సిగ్గుపడాలి..ముందు నీ పేరులోనుంచి శ్రీరామ్ ను తొలగించు. ఆ పేరుతో పిలిపించుకునేందుకు నువ్వు అర్హుడివి కాదు’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది.

అయితే శ్రీరెడ్డి స్క్రీన్ షాట్లు చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్లలో పూర్తి చాట్ హిస్టరీ లేదని - ఎడిట్ చేసి ఉందని అంటున్నారు. అయితే ఆ చాట్ లో సంభాషణ ఇద్దరికీ ఇష్టపూర్వకంగానే...సరదాగా సాగిందని అంటున్నారు. శ్రీరామ చంద్ర సరదాగా పెట్టిన కామెంట్లకు శ్రీరెడ్డి సీరియస్ అయినట్లు ఆ స్క్రీన్ షాట్లలో లేదని - శ్రీరెడ్డి కూడా అతడి మెసేజ్ లకు సరదాగానే రిప్లై ఇచ్చిందని కామెంట్స్ పెడుతున్నారు. 

loader