మీ చెప్పుతో కొట్టండి: పవన్ కల్యాణ్ తల్లిపై కామెంట్స్ మీద శ్రీరెడ్డి, ట్విస్ట్ కూడా...

మీ చెప్పుతో కొట్టండి: పవన్ కల్యాణ్ తల్లిపై కామెంట్స్ మీద శ్రీరెడ్డి, ట్విస్ట్ కూడా...

హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తల్లిపై చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి దిగొచ్చారు. పవన్ కల్యాణ్ తల్లికి ట్విట్టర్ లో క్షమాపణ చెప్పింది. మీ చెప్పుతో కొట్టండని అన్నది. 

"పవన్ కల్యాణ్ అమ్మగారికి నా శిరస్సు వంచి పది లక్షల సాష్టాంగ నమస్కారాలు. నఅర్న్ను క్షమించండి అమ్మ. మీ చెప్పుతో కొట్టండి కానీ సినీ పెద్దలకు మిమ్మల్ని అంటే కానీ అర్థం కాలేదమ్మా ఈ ఒంటరి ఆడపిల్ల బాధ" అని ఓ ట్విస్ట్ ఇచ్చింది. 

"మీ ఫొటో చూసి పదిలక్షల సార్లు క్షమించమని వేడుకున్నా అమ్మ" అని ట్విట్టర్ లో పోస్టు చేసింది. అయితే, మీడియా వాహనాలపై పవన్ కల్యాణ్ అభిమానుల దాడిని ఖండిస్తూ అంతకు ముందు ట్విట్టర్ లో మరో పోస్టు పెట్టింది. 

"ఫ్యాన్స్ అంటే జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి, ప్రజల సమస్యల కోసం పోరాడుతూ... నలుగురికి మార్గదర్శకం అవ్వాలి అంతేకానీ సహనం కోల్పోయి కార్లు పగలగొట్టడం కాదు" అని వ్యాఖ్యానించింది.

ఫ్యాన్స్ పవన్ కల్యాణ్ కు బలం కావాలి గానీ బలహీనత కాకూడదని అభిప్రాయపడింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ శుక్రవారం ఫిల్మ్ ఛాంబర్ కు రావడంపై కూడా ఆమె స్పందించింది. మెగా ఫ్యామిలీ ఎప్పుడో స్పందించి ఇఉంటే చాలా హుందాగా ఉండేదని, ఏమైనా రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు తాను వీరాభిమానిని అని ప్రకటించుకుంది.

"పవన్ కళ్యాణ్ అన్న నేను స్టార్ట్ చేసిన ఈ ఉద్యమంలో ఎటువంటి రాజకీయ రంగూ లేదు, ఇదంతా మీకు మీరు ఏదేదో ఊహించుకుని సృష్టించిందే, మీ వుహల్లోంచి వచ్చినవే ఈ పాత్రలు, సన్నివేశాలు, మరల చెప్తున్నా TV9, ABN, MAHAA channels కి ఏ సంభందం లేదు, మీ ట్విట్స్ చూస్తుంటే చాలా జాలి వేస్తుంది" అని శ్రీరెడ్డి మరో పోస్టు పెట్టింది.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page