శ్రీరెడ్డిని మీరు వాడుకున్నారు... ఛాన్స్ నేను ఇస్తా

First Published 28, Mar 2018, 3:24 PM IST
Srireddy offered good character in teja film
Highlights
శ్రీరెడ్డిని మీరు వాడుకున్నారు... ఛాన్స్ నేను ఇస్తా

టాలీవుడ్ లో శ్రీరెడ్డి రెండు వారాలుగా నానా చేస్తుంది. టీవీల్లో సోషల్ మీడియాలో మొత్తం శ్రీరెడ్డి హాంగామానే. తనకు జరిగిన అన్యాయాల గురించి సినీ ఇండస్ర్టీలో జరుతున్న అన్యాయాల గురించి తను పోరాటం చేస్తున్నాని తెలిపింది. తనను చాలామంది దర్శకులు వాడుకొని వదిలేశారని వాళ్లల్లో కొన్ని ఫోటోలు కూడా తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది టాలీవుడ్ లోని పెద్ద పెద్దోల్లకు కలకలంగా మారింది. కానీ ఇవి చూసిన తేజ మాత్రం శ్రీరెడ్డి మాటలకు స్పందించారు. 
 
తేజ మాట్లాడుతు శ్రీరెడ్డి ఆరోపణలు విని ఆమెతో మాట్లాడాలనిపించి పిలిపించానని.. ఆమె చెప్పిందంతా విన్నాక తనకు అన్యాయం జరిగిందని తాను నమ్ముతున్నానని తేజ అన్నాడు. శ్రీరెడ్డికి తాను రెండు సినిమాల్లో అవకాశాలిస్తున్నట్లు తేజ ప్రకటించడం విశేషం. ప్రస్తుతం తేజ రెండు సినిమాలకు కమిటై ఉన్నాడు. నందమూరి బాలకృష్ణతో ‘యన్.టి.ఆర్’ బయోపిక్ తో పాటు విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల్లోనూ శ్రీరెడ్డికి పాత్రలు ఇస్తున్నాడట తేజ. మొత్తానికి శ్రీరెడ్డికి అవకాశాలిస్తామని చెప్పి చాలా మంది మోసం చేశారని ఆమె అంటుంటే.. తేజ మాత్రం ఆమె ఆవేదన విని.. రెండు పెద్ద సినిమాల్లో అవకాశాలిస్తుండటం విశేషమే. మరి ఈ సినిమాల్లో ఆమె పాత్రలెలా ఉంటాయో చూద్దాం.

loader