టాలీవుడ్ లో లైంగిక వేధింపుల వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలతో శ్రీరెడ్డి పాపులర్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొందరిని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తోంది. ఎప్పటిలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా శ్రీరెడ్డి క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ పై హాట్ కామెంట్స్ చేసింది. 

ఇటీవల తాను విమానంలో ప్రయాణిస్తుండగా కీర్తి సురేష్ ని చూసిందట. ఆమెని ఎవ్వరూ పట్టించుకోలేదని తన వెంట పడ్డారని శ్రీరెడ్డి చెబుతోంది. కీర్తి సురేష్ ఇటీవల జిమ్ లో బాగా కసరత్తులు చేసి తన లుక్ మార్చుకుంది. కీర్తి సురేష్ బాగా సన్నబడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ కొత్త లుక్ పై శ్రీరెడ్డి మాట్లాడుతూ.. సన్నగా అవడం వల్ల కీర్తి సురేష్ పేషంట్ లాగా మారింది. విమానంలో ఆమెని ఎవ్వరూ గుర్తించలేదు. అందరూ సెల్ఫీల కోసం నావద్దకు వచ్చారు అని శ్రీరెడ్డి తెలిపింది. 

కీర్తి సురేష్ లుక్ పై అభిమానుల్లో కూడా అసంతృప్తి ఉంది. కానీ ఇటీవల మన్మథుడు 2 చిత్రంలో కీర్తి సురేష్ గ్లామర్ గానే కనిపిస్తోంది. రాబోవు చిత్రాల్లో కీర్తి సురేష్ ఎలా కనిపిస్తుందో వేచి చూడాలి. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించిందని కీర్తి సురేష్ కు ప్రశంసలు దక్కాయి. కీర్తి సురేష్ ఇంతవరకు హద్దులు దాటి అందాలు ఆరబోయలేదు. నటనతోనే అవకాశాలు అందుకుంటోంది.