శ్రీరెడ్డి: రేణుదేశాయ్ కు మద్దతిస్తూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్!

srireddy attacks pawan kalyan's fans for abusing renu desai
Highlights

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరో పెళ్లికి రెడీ అవుతుండడంతో సోషల్ మీడియాలో ఆమెపై 

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరో పెళ్లికి రెడీ అవుతుండడంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. ఎంతగా అంటే ఆ వేధింపులు భరించలేక ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ను డిలీట్ చేసేసింది.

అలా అని రేణుదేశాయ్ సైలెంట్ గా ఉందనుకుంటే పొరపాటే.. పవన్ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే విధంగా కౌంటర్లు వేసింది. ఈ విషయంలో రేణు దేశాయ్ ను సపోర్ట్ చేస్తూ నటి శ్రీరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసింది.

''రేణుదేశాయ్ చిన్న వయసులోనే విడాకులు తీసుకున్నారు. దానికి కారణాలు ఏవైనా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆమె వ్యక్తిగత జీవితం కాబట్టి. కొందరు నకిలీ అకౌంట్లతో ఆమెను వేధిస్తున్నారు. పూణేలో ఒంటరిగా ఉంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్న ఆమెను ఈ విధంగా విమర్శించడం సరికాదు. ఆమె ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారనే ఎవరికైనా తెలుసా..? కష్టకాలంలో ఆమెను ఆదుకోలేనివారు ఇప్పుడు ఆమెపై విమర్శలు గుప్పించడం కరెక్ట్ కాదు. ఆమె జీవితంలోకి తొంగి చూసే అధికారం మీకు లేదంటూ'' పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడింది. 
 

loader