ఆ ఇంట్లోకి వెళ్ళాక డైరెక్టర్ కి దరిద్రం షురూ..మహేష్ ఓకె చెప్పాడు కానీ, అట్టర్ ఫ్లాప్ పై అసలు విషయం వెలుగులోకి
హాస్యంతో సినిమాలు హిట్ చేసే ట్యాలెంట్ కొద్దిమంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. డైరెక్టర్ శ్రీనువైట్ల కమర్షియల్ చిత్రాలు తెరకెక్కిస్తూనే కామెడీతో మెప్పించడం తన బలంగా మార్చుకున్నారు.
హాస్యంతో సినిమాలు హిట్ చేసే ట్యాలెంట్ కొద్దిమంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. హాస్యం విషయంలో లెజెండ్రీ డైరెక్టర్ జంధ్యాల అగ్ర స్థానంలో ఉంటారు. ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ లాంటి వాళ్ళు వచ్చాయి. డైరెక్టర్ శ్రీనువైట్ల కమర్షియల్ చిత్రాలు తెరకెక్కిస్తూనే కామెడీతో మెప్పించడం తన బలంగా మార్చుకున్నారు.
ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకడిగా శ్రీనువైట్ల
ఒకప్పుడు శ్రీనువైట్ల టాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు. శ్రీనువైట్ల తన కెరీర్ లో సొంతం, ఆనందం, వెంకీ, దుబాయ్ శీను, దూకుడు, కింగ్, రెడీ, బాద్షా లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందించారు. వరుసహిట్లతో దూసుకుపోయారు. మధ్యలో ఒకటి రెండు ఫ్లాపులు పడ్డప్పటికీ శ్రీనువైట్ల ఇమేజ్ చెక్కు చెదరలేదు. కానీ ఒకే ఒక్క చిత్రంతో శ్రీనువైట్ల కెరీర్ తలక్రిందులు అయింది. ఆ చిత్రం ఏదో ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. ఆ మూవీనే మహేష్ బాబుతో చేసిన ఆగడు.
మహేష్ బాబు 'ఆగడు' మూవీ ఫ్లాప్ కి కారణం ఇదే
శ్రీనువైట్ల ప్రస్తుతం గోపీచంద్ తో విశ్వం అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 11న ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. దీనితో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల విశ్వం విశేషాలు చెబుతూనే తన ఫ్లాపుల గురించి కూడా ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలో ఆగడు చిత్రం గురించి ప్రస్తావన రాగా.. తన లైఫ్ లో పెద్ద రిగ్రెట్ గా ఫీల్ అయ్యే చిత్రం ఆగడు అని శ్రీను వైట్ల అన్నారు. దానికి కారణం ఉంది. దూకుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబుతో భారీ బడ్జెట్ లో ఒక చిత్రం చేయాలనుకున్నా.
అప్పుడు ఆగడు మూవీ చేయాలనే ఆలోచన లేదు. భారీ యాక్షన్ కథని మహేష్ బాబుకి చెప్పా. సూపర్ గా ఉంది చేద్దాం అని అన్నారు. 14 రీల్స్ నిర్మాతలు నాకు బాగా క్లోజ్. వాళ్ళకి కూడా కథ నచ్చింది. కానీ నేను చెప్పిన అంత భారీ బడ్జెట్ కుదరదని చెప్పారు. ఆ టైంలో వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనితో ఆ కథని పక్కన పెట్టేసి సింపుల్ బడ్జెట్ లో ఆగడు చేశాం. ఆగడు చేయకుండా ఉండాల్సింది అని ఇప్పటికీ బాధపడుతుంటా అని శ్రీను వైట్ల అన్నారు.
శ్రీనువైట్లకి దరిద్రం మొదలైంది ఆ ఇల్లు వల్లే ?
దూకుడు తర్వాత మహేష్ బాబు సినిమాపై ఉన్న భారీ అంచనాల వల్ల ఆగడు హిట్ కాలేదు అని శ్రీను వైట్ల అన్నారు. అక్కడి నుంచే శ్రీను వైట్ల పరాజయాల పరంపర మొదలైంది. ఆగడు తర్వాత.. బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోని ఇలా వరుస డిజాస్టర్స్ ఎదురయ్యాయి. ఈ ఫ్లాపులు శ్రీనువైట్లని టాప్ డైరెక్టర్ల జాబితాలో లేకుండా చేశాయి. శ్రీనువైట్ల కెరీర్ ఇంతలా దిగజారడానికి మరో కారణం కూడా ఉందని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది.
ఆగడు మూవీ టైంలో శ్రీనువైట్ల ఒక పెద్ద ఇల్లు కొనుక్కుని అందులోకి మారారట. ఆ ఇల్లు వాస్తు ప్రకారం శ్రీనువైట్లకి కలసి రాలేదని.. అందువల్లే దరిద్రం మొదలైందని టాక్ ఉంది. దీనిపై కూడా శ్రీనువైట్ల స్పందించారు. ఆ ఇల్లు నేను ఇష్టపడి కొనుక్కున్నా. నేను టైంని నమ్ముతాను కాను వాస్తుని నమ్మను. కొంతకాలం తర్వాత శ్రీనువైట్ల ఆ ఇంటినుంచి మరో ఇంటికి మారారు. దీనిపై కూడా తన వెర్షన్ వినిపించారు. కలసి రాలేదు కాబట్టి ఆ ఇంట్లోనుంచి నేను బయటకి రాలేదు. ఆ ఇల్లు మరీ పెద్దదైంది. నాకు కొంచెం క్లోజ్ గా చిన్న ఇంట్లో ఉండడం ఇష్టం. అందుకే ఇల్లు మారాము. ఆ ఇంటిని అద్దెకి ఇచ్చా. అందులో ఉంటున్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇల్లు అమ్మేస్తే కొనుక్కుంటాము అని కూడా అడుగుతున్నారు. కానీ నేను అమ్మలేదు అని శ్రీనువైట్ల తెలిపారు.
'విశ్వం'లో వెంకీ తరహా కామెడీ
ఇక విశ్వం చిత్రానికి వస్తే ఈ మూవీలో వెంకీ చిత్రం తరహాలో ట్రైన్ కామెడీ ఎపిసోడ్ ఉంది. అయితే వెంకీకి ఈ చిత్రానికి అసలు సంబంధం లేదు అని శ్రీనువైట్ల తెలిపారు. కామెడీ విషయంలో శ్రీనువైట్ల క్రేజ్ ని పీక్ కి తీసుకెళ్లిన చిత్రం వెంకీ. ఆ చిత్రంలో బ్రహ్మి కామెడీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో వైరల్ అవుతూ ఉంటుంది.
శ్రీనువైట్ల ఇండస్ట్రీలోకి వచ్చి పాతికేళ్ళు పూర్తవుతోంది. 1999లో శ్రీనువైట్ల రవితేజతో నీకోసం అనే చిత్రం తెరకెక్కించారు. ఆ మూవీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఆనందం చిత్రంతో హిట్ కొట్టారు. మళ్ళీ రవితేజతో వెంకీ మూవీ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.