సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగడు మూవీ ముందు వరకు శ్రీనువైట్ల టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. కానీ ఆగడు నుంచి శ్రీను వైట్ల డిజాస్టర్స్ పరంపర మొదలయింది. ప్రస్తుతం శ్రీను వైట్లకుతో సినిమా చేసేందుకు హీరోలు ఆలోచిస్తున్నారు. గత ఏడాది శ్రీనువైట్ల రవితేజతో అమర్ అక్బర్ ఆంటోని చిత్రాన్ని తెరక్కించాడు. 

ఈ చిత్రం విజయం సాధించి ఉంటే శ్రీను వైట్ల తిరిగి పుంజుకునే అవకాశం ఉండేది. కానీ అమర్ అక్బర్ ఆంటోని చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది. ఈ చిత్రంలో శ్రీను వైట్ల దారులన్నీ మూసుకుపోయినట్లు అంతా భవించారు. కానీ శ్రీను వైట్లలో ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రతిభ ఉంది. 

శ్రీను వైట్ల చిత్రాలన్నింటిలో వినోదం ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా శ్రీను వైట్ల తన కెరీర్ లో మంచు విష్ణు, రామ్, ఆకాష్ లాంటి యంగ్ హీరోలందరికీ హిట్స్ ఇచ్చాడు. కొంతకాలంగా శ్రీను వైట్ల తదుపరి చిత్రం మంచు విష్ణుతో అంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో హీరో పేరు వినిపిస్తోంది. 

ఇటీవల రాక్షసుడు చిత్రంతో బెల్లంకొండ శ్రీనివాస్ మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. దీనితో బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొని ఉంది. శ్రీను వైట్ల చెప్పిన కథకు బెల్లంకొండ శ్రీనివాస్ ఇంప్రెస్ అయ్యాడట. భారీ బడ్జెట్ లో తెరకెక్కించే చిత్రానికి శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

శ్రీనువైట్ల ఎలాగైనా మ్యాజిక్ చేస్తాడని బెల్లకొండ శ్రీనివాస్ నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఆసక్తి రేపుతున్న ఈ కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బెల్లకొండ శ్రీనివాస్ కూడా మంచి మాస్ హిట్ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నాడు.