Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. పాశ్చాత్య భావాలు కలిగిన, సాంప్రదాయ భావాలు కలిగిన ఇద్దరు అక్కచెల్లెళ్ల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.  

 ఎపిసోడ్ ప్రారంభంలో ఏం జరిగిందో చెప్పు అంటూ చారుని ప్రశ్నిస్తాడు రఘురాం. జరిగిందంతా చెప్తుంది చారు. ఇదంతా నేను కావాలని చేయలేదు తనని భయపెట్టాలని చేశాను అంటాడు శీను. ఇంకా నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేయకపోతే నేను పరిగెత్తుకొని వచ్చేసాను అంటుంది చారు. శీను నేను నిన్ను గమనిస్తున్నాను.

 ఒకవైపు పెళ్లి వద్దంటూనే మరోవైపు ఈ తొందరపాటు ఏంటి అంటాడు రఘురాం. తన తమ్ముడితో చెప్పి పెళ్లికి ముహూర్తాలు పెట్టించి..చారు తల్లిదండ్రులకి కూడా కబురు పెట్టమని పంపిస్తాడు రఘురాం. అక్కడినుంచి అందరూ వెళ్ళిపోతారు. పద్మ వెళ్ళిపోతూ పెళ్లంటే ఇష్టం లేదన్నావ్ ఏంట్రా ఈ పనులు అంటుంది.

 అమ్మ.. అక్కడ జరిగింది వేరు చారు చెప్తుంది వేరు అని శీను చెప్తాడు కానీ ఎవరూ పట్టించుకోరు. చారుని తలుచుకుంటూ నిన్ను ఇంట్లోంచి బయటికి పంపించేద్దాం అనుకున్నాను కానీ నువ్వు నేరుగా నా జీవితంలోకి వచ్చేస్తున్నావు అంటూ ప్రస్టేట్ అవుతాడు శీను. మరోవైపు కాలేజీలో ఫ్యాషన్ షో ప్రోగ్రాం స్టార్ట్ అవుతున్నట్లుగా ఎనౌన్స్ చేస్తుంది యాంకర్.

 ఒక్కొక్కరుగా వచ్చి పెర్ఫామెన్స్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. జడ్జిలు అందానికి ఆత్మవిశ్వాసానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఎవరితో వచ్చిన సమాధానాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. మరోవైపు రామలక్ష్మి కనిపించకపోవడంతో ఆమెని వెతకడానికి వెళ్తుంది ఆద్య, ఆమె ఫ్రెండ్. మరో అమ్మాయి వచ్చి రామలక్ష్మి గెలుస్తుందని ఎలా అనుకున్నావు.

 నీకు శైలుకి మధ్యన అనవసరంగా రామలక్ష్మిని ఇరికించేసావు ఇప్పుడు చూడు ఏకంగా కనిపించకుండా పోయింది అంటుంది. మరో అమ్మాయి వచ్చి అనవసరంగా శైలుతో పోటీకి దిగావు ఇప్పుడు నువ్వు ఓడిపోవడం ఖాయం శైలు చేతిలో అవమానపడటం ఖాయం అంటుంది. అలా ఏమీ జరగదు రామలక్ష్మి వస్తుంది నన్ను ఓడిపోనివ్వదు అంటుంది ఆద్య.

 మరోవైపు పొట్టి డ్రెస్ వేసుకొని ఏడుస్తూ గుడిలోకి వెళ్తుంది రామలక్ష్మి. నువ్వు చాలా శక్తి మంత్రాలు ఇవన్నీ మా అమ్మ చాలాసార్లు చెప్పింది కానీ నన్ను ఎందుకు ఇంత శక్తి హీనురాలిగా పుట్టించావు. దయచేసి నాకు ధైర్యాన్ని ప్రసాదించు నేను సాంప్రదాయము కట్టుబాట్లతో పెరిగాను నేను చూసిందే ప్రపంచం అనుకున్నాను అలాంటి నాకు ఆధ్యా చాలా సాయం చేసింది ఇప్పటివరకు ఆమె నాకోసం చాలా చేసింది.

 అలాంటి ఆద్య కి పోటీలో గెలుస్తాను అని మాట ఇచ్చాను దయచేసి నాకు మాట నిలబెట్టుకునే శక్తిని ప్రసాదించు. నేను న్యాయంగా గలవాలనుకుంటే వాళ్లు దుర్మార్గంగా ఓడించడానికి చూస్తున్నారు. నువ్వే దారి చూపించాలి అంటూ చేతులు జోడించి ప్రార్థిస్తుంది. ఈ బట్టల్లో వెళ్తే అందరి ముందు చులకన అయిపోతాను.

అందరూ నిన్ను అమ్మలు కన్న అమ్మవి అంటారు కదా మరి నీ బిడ్డని ఓదార్చ లేవా అంటూ కన్నీరు పెట్టుకుంటుంది రామలక్ష్మి. అదే సమయంలో అమ్మ కరుణించినట్లుగా జానకి అమ్మవారికి ప్రసాదించిన చీర రామలక్ష్మి మీద పడుతుంది. నాకు దారి చూపించావా అంటూ ఆనందపడుతూ చీర పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆద్య. మరోవైపు శైలుని రాంప్ మీదకి పిలుస్తుంది యాంకర్.

 తన పర్ఫామెన్స్ అయిపోయిన తర్వాత సొసైటీ అంటే ఏంటి అని అడుగుతారు జడ్జిలు. సొసైటీ అంటే నేను, నేనే సొసైటీ అని సమాధానం చెబుతుంది శైలు. ఆమె వెళ్లిపోయిన తర్వాత రామలక్ష్మిని రావలసిందిగా పిలుస్తుంది యాంకర్. రామలక్ష్మి రాకపోవటంతో తల పట్టుకుంటుంది ఆద్య. అంతలోనే అందరూ చప్పట్లు కొట్టడంతో తలెత్తి చూసేసరికి నిండుగా చీర కట్టుకొని స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇస్తుంది రామలక్ష్మి.

 తన పర్ఫామెన్స్ అయిపోయిన తర్వాత  అందమంటే ఏమిటి అని అడుగుతారు జడ్జి. అందమంటే కంటికి కనిపించేది కాదు మనసుకి కనిపించేది. అది మన మాటలో నడవడికలో మంచితనంలో ఉంటుంది అని సమాధానం చెప్తుంది రామలక్ష్మి. వ్యక్తిత్వాన్ని మించిన అందం ఏది ఉండదు అని చెప్తుంది. నువ్వెందుకు ట్రెడిషనల్ లుక్ లో వచ్చావు అని మరొక జడ్జి అడుగుతుంది.

 ట్రెడిషనల్ అంటే దైవత్వం దాన్ని అనుసరించాలనిపిస్తుంది అంటుంది. చీరలో వస్తే గెలుస్తాను అనుకున్నావా అని మరొక జడ్జ్ ప్రశ్నిస్తుంది. లేదు మేడం 10 నిమిషాల ముందు వరకు నేను అసలు పోటీలో పాల్గొంటానో లేదో అని అనుకున్నాను కానీ అమ్మవారి దయతోనే ఇక్కడ వరకు వచ్చాను. ఇంటిని బాధ్యతగా తీర్చిదిద్దే స్త్రీమూర్తులు మన భరతమాత కూడా మన సంస్కారానికి నిలువుటద్దంలా చీర కట్టుకొని ప్రతిబింబిస్తుంది  అంటుంది రామలక్ష్మి.

 ఆమె మాటలకి అందరూ చప్పట్లు కొడతారు. జడ్జిలు స్టేజ్ మీదకి వెళ్లి విన్నర్ ని అనౌన్స్ చేయడానికి ప్రిపేర్డ్ గా ఉంటారు. అందరూ శైలు శైలు అంటూ అరుస్తూ ఉంటారు. గెలుస్తానో లేదో అని టెన్షన్ పడుతుంది రామలక్ష్మి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం