యాక్టర్ కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో కాస్తంత జోరు తగ్గించారు. దర్శకుడుగా  'జ్యో అచ్యుతానంద' పెద్దగా కిక్ ఇవ్వలేదు. ఆ తర్వాత తను ప్రధాన పాత్రలో చేసిన అడల్ట్ కామెడీ 'బాబు బాగా బిజీ' డిజాస్టర్ అయ్యింది. దాంతో కాస్త ఆచి, తూచి అడుగులు వెయ్యాలని ఫిక్స్ అయ్యాడు.

అందుకు తగినట్లుగానే కొత్త తరహా కాన్సెప్ట్ లతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా మంచు లక్ష్మితో మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సీరిస్ చేసిన ఆయన మరోసారి మంచు లక్ష్మితో కలిసి ఓ చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం టైటిల్ గా 'NRI- నాయనా రారా ఇంటికి' .

 లైటర్ వెయిన్ ఎంటర్టైనర్ గా రూపొందే  ఈ సినిమా ద్వారా  దర్శకుడుగా బాలా రాజశేఖరుని పరిచయం అవుతున్నారు.  నిర్మాత ప్రదీప్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారుఈ చిత్రం.. బుధవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకి, హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. 

ఇక ఈ సినిమాలో ముందే చెప్పినట్లు  మంచు లక్ష్మి పాత్ర హైలెట్ గా నడుస్తుందిట.  అలాగే ఈ సినిమాలో నాగబాబు.. మహతి ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.  ఎన్నారై గా అవసరాల అదరకొడతాడని సమాచారం.  ఈ ఫస్ట్ లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటం కలిసొచ్చే అంశం.