తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడో సీజన్ కి సిద్ధమవుతుంది. జూలై నెల రెండో వారం నుండి ఈ షో ప్రారంభం కానుంది. హోస్ట్ గా నాగార్జునని ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

ఈ షోలో పాల్గొనబోయే 17 మంది కంటెస్టంట్ లు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. సీజన్ 1 లో పాల్గొన్న పోటీదారులతో పోలిస్తే సీజన్ 2లో పాల్గొన్న కంటెస్టంట్స్ కాస్త వీక్ అనే చెప్పారు. ఆ ఇంపాక్ట్ షో రేటింగ్స్ పై కూడా పడింది. సీజన్ 3 విషయంలో అలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు.

అందుకే ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 షోకి తీసుకురాబోతున్నారట. దీనిలో భాగంగా పాపులర్ యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ 3 కంటెస్టంట్ గా ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీముఖి ఇటీవల పటాస్ షో నుండి బయటకి రావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుంది.

'పటాస్' షోకి బ్రేక్ ఇస్తున్నానని ఓ వీడియో  రిలీజ్ చేసింది శ్రీముఖి. దానికి కారణం మాత్రం చెప్పలేదు. కొన్నాళ్లపాటు 'పటాస్'కి బ్రేక్ ఇచ్చింది బిగ్ బాస్ షో కోసమే అంటూ వార్తలు ఊపందుకున్నాయి. అదే నిజమైతే ఈ రాములమ్మ బిగ్ బాస్ షోలో ఎంత హడావిడి చేస్తుందో చూడాలి!