ఎవరి ఇష్టం వారికి ఆనందం అన్నట్టుగా టాటూలు వేయించుకోవద్దని అనలేకపోయినా.. సెలబ్రిటీలు టాటూలుగా ఏం వేయించుకున్నారన్నది ఆసక్తి క్రియేట్ చేస్తుంది. కొందరి టాటూలు ఆకట్టుకుంటే ఇంకొందరివి ఆశ్చర్య పరుస్తాయి. ఈ కేటగిరీలోకే వస్తుంది యాంకర్ శ్రీముఖి. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా టాటూ వేయించుకున్నానంటూ.. దానిని చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ అరబిక్ కొటేషన్ ను అదే భాషలో టాటూ గా వేయించుకుంది. చాలామందికి అరబిక్ రాదు కాబట్టి ఆ కొటేషన్.. దాని అర్ధం కూడా ఆమే చెప్పేసింది.

 

‘‘ప్రేమికుల దినోత్సవం సందర్భంగా హుబా నఫ్సక్ ఆలా అనే టాటూ వేయించుకున్నా. అరబిక్ లో దీని అర్ధం ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. నేను పుట్టినప్పటి నుంచి నా ఫేవరెట్ నేనే’’అంటూ తన టాటూ గురించి షేర్ చేసింది. హీరోయిన్లుగా ఫాంలో ఉన్నప్పుడే టాటూ ముద్ర వేయించుకోవడానికి నేటి తరం అమ్మాయిలు ఏమీ జంకడం లేదు. శృతీ హాసన్, త్రిష.. నయనతార.. సమంత.., రోజా ఇలా ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. లేటెస్ట్ గా టాటూ గర్ల్స్ సరసన శ్రీముఖి చేరింది.