Asianet News TeluguAsianet News Telugu

విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్.. అలాంటి పరిస్థితిలో వివరణ ఇచ్చిన టాలీవుడ్ నటుడు!

హీరో శ్రీకాంత్ - ఊహ విడాకులు తీసుకుంటున్నారనే పుకారుపై తాజాగా శ్రీకాంత్ స్పందించారు. అందంతా ఫేక్ అంటూ తీవ్రంగా ఖండించారు. గతంలో అలా చేశారని.. మళ్లీ ఇప్పుడు ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని మండిపడుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 
 

Srikanth strongly denied divorce rumours and gave clarity!
Author
First Published Nov 22, 2022, 2:14 PM IST

హీరో  శ్రీకాంత్-  నటి ఊహ 1997లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరి వైవాహిక బంధం సాఫీగా సాగుతోంది. 25 ఏళ్లుగా ఇద్దరు పిల్లలతో వీరిద్దరి కాపురం చక్కగా కొనసాగుతోంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నిర్మల కాన్వెంట్, పెళ్ళిసందD చిత్రాల్లో రోషన్ హీరోగా నటించాడు. ఇదిలా ఉంటే.. రెండ్రోజులుగా హీరో శ్రీకాంత్ - ఊహ విడిపోతున్నారనే వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.  కొన్నాళ్లుగా శ్రీకాంత్ తో ఊహకు విబేధాలు తలెత్తుతున్నాయని, ఆర్థికపరమైన ఇబ్బందులే వీరి మధ్య గొడవలకు కారణమని ప్రచారం జరిగింది. ఆ సమస్య డివోర్స్ దాకా తీసుకొచ్చిందని పుకార్లు చక్కర్లు కొట్టారు. 

ఈ వార్త ఊహా తెలియడంతో శ్రీకాంత్ కు చేరవేసింది. దీనిపై శ్రీకాంత్ తాజాగా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తీవ్రంగా ఖండించారు.  శ్రీకాంత్  మాట్లాడుతూ.. ‘ఎవరు పుట్టిస్తున్నారు ఇలాంటి నిరాధారమైన పనికిమాలిన వార్తలను...!?  గతంలో నేను చనిపోయినట్లుగా ఒక పుకారు పుట్టించి నా కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురి చేశారు. ఇప్పుడు తాజాగా మేము ఆర్థిక ఇబ్బందుల కారణంగా  విడాకులు తీసుకుంటున్నాం అంటూ ఒక న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ , వెబ్సైట్స్ లో వచ్చిన  ఈ ఫేక్ న్యూస్ ను  తన ఫ్రెండ్స్  ఊహకు ఫార్వర్డ్ చేయడంతో తను కంగారుపడుతూ ఆ పోస్టులను నాకు చూపించింది. ఇలాంటివి ఏమాత్రం నమ్మద్దు ...ఆందోళన పడవద్దు ... అని తనను ఓదార్చాను. 

కొందరూ క్రియేట్ చేసిన ఈ పుకారు సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో బంధుమిత్రులందరూ ఫోన్ చేసి   అడుగుతుంటే వివరణ  ఇచ్చుకోవడం పెద్ద న్యూసెన్స్ గా అనిపిస్తుంది . ప్రస్తుతం నేనూ  ఊహ నిన్న చెన్నై వచ్చి ఇక్కడి నుండి దైవ దర్శనానికి అరుణాచలం వెళ్తున్నాం. ఇలాంటి తరుణంలో ఈ పుకారు మా కుటుంబానికి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇది ఇంకా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండటం కోసం  ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాను. నా మీదనే కాకుండా  చాలామంది ప్రముఖుల మీద ఇలాంటి నిరాధారమైన పుకార్లు స్ప్రెడ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. 

సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీకాంత్ కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. హీరోగా ఫేడ్ అవుటైన శ్రీకాంత్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లోనూ కాస్తా మెరుగైన ఫలితాలను అందుకుంటున్నారు. శ్రీకాంత్ విలన్ రోల్ చేసిన ‘అఖండ’ మంచి విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ లేవనే చెప్పాలి. ఇక కొడుకు రోషన్ ని హీరోగా నిలబెట్టేందుకూ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios