Devara : షూటింగ్ లో శ్రీకాంత్ కు గాయం.. కాలికి పట్టి కట్టుకునే.. ఏమైందంటే?
సీనియర్ నటుడు శ్రీకాంత్ నటిస్తున్న చిత్రాల్లో ఎన్టీఆర్ ‘దేవర’ ఒకటి. ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా షెడ్యూల్ లో ఆయనకు గాయమైనట్టు తానే స్వయంగాగా తెలిపారు.
ఫ్యామిలీ ఆడియెన్స్ ఎంతగానో ఇష్టపడే నటుడు శ్రీకాంత్ (Srikanth). ఒకప్పుడు హీరోగా ఎన్ని సినిమాలు చేశారో తెలిసిందే. అప్పటి ప్రేక్షకుల్లో ఇంటింటికి ఇయనకు అభిమానులు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన ప్రతిభతో వెండితెరపై ఎంతగానో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. రెండోదశలో శ్రీకాంత్ విలన్ పాత్రలు, కీలకమైన రోల్స్ ల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
‘సరైనోడు’, ‘అఖండ’, ‘వారసుడు’, ‘హంట్’, ‘స్కంద’ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, తారక్ ‘దేవర’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ గ్యాప్ లో ‘కోటబొమ్మాళి పీఎస్’ చిత్రాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.
అయితే, ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు శ్రీకాంత్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu 7) రీసెంట్ ఎపిసోడ్ లో ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాలికి బ్లాక్ పట్టి కట్టుకొని కనిపించారు. వెంటనే నాగ్ ఏమైందని అడిగారు. దీంతో ‘దేవర’ (Devara) మూవీ సెట్స్ లో గాయపడ్డట్టు తెలిపారు.
గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో సెట్ లోని కంకరపై పరిగెడుతున్న సందర్భంగా గాయమైంది. డాక్టర్ కాస్తా రెస్ట్ కావాలని చెప్పారు. ట్రీట్ మెంట్ తర్వాత కూడా షూటింగ్ కు హాజరయ్యే ప్రమోషన్స్ కు హాజరైనట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. శ్రీకాంత్ వర్క్ డెడికేషన్ కు నెటిజన్లు అభినందిస్తున్నారు. మరోవైపు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.