హిట్ , ఫ్లాఫ్ లకు సంబంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న హీరో ఎవరూ అంటే శ్రీకాంత్ అనే చెప్పాలి.  ఆయన  ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్‌’. జై రాజా సింగ్‌ దర్శకత్వం వహించిన ... ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు.

హిట్ , ఫ్లాఫ్ లకు సంబంధం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తున్న హీరో ఎవరూ అంటే శ్రీకాంత్ అనే చెప్పాలి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మార్షల్‌’. జై రాజా సింగ్‌ దర్శకత్వం వహించిన ... ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీకాంత్ డాక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపించి అలరించారు. వైద్యం పేరుతో ఆడవాళ్లను కిడ్నాప్‌ చేసి స్టెరాయిడ్లు ఎక్కించడం వంటి సన్నివేశాలను చూస్తే ఇదో మెడిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ అని అర్ద‌మ‌వుతుంది. 

‘ఈ భూమ్మీద పుట్టి చనిపోయే ప్రతి మనిషి.. మొట్టమొదటగా, చిట్టచివరగా చూసేది డాక్టర్‌నే. మానవ శరీరాన్ని సృష్టించేది దేవుడే అయినా.. అప్పగించేది మాత్రం వైద్యుడే’ అన్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది. డాక్టర్ గా కనిపించే శ్రీకాంత్ ...ఓ పక్క వైద్యం చేస్తూనే మరోపక్క రౌడీలను చితకబాదుతూ కనిపించారు. 

 ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అభయ్‌, మేఘా, రష్మి కీలక పాత్రలు పోషించారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.