'పెదకాపు-1' అంటూ శ్రీకాంత్ అడ్డాల సెన్సేషన్.. వైరల్ అవుతున్న ఫస్ట్ లుక్

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. అప్పట్లో శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతంగా ఆకర్షించేవి. 

Srikanth Addala sensational first look of PedaKapu 1 dtr

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. అప్పట్లో శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతంగా ఆకర్షించేవి. కానీ బ్రహ్మోత్సవం చిత్రంతో కథ అడ్డం తిరిగింది. ఆ చిత్ర పరాజయంతో శ్రీకాంత్ అడ్డాల చాలా కాలం కనిపించలేదు. 

తిరిగి వెంకటేష్ నారప్ప చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించే ఆయన నారప్ప లాంటి రా అండ్ రస్టిక్ మాస్ చిత్రాలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. అయితే శ్రీకాంత్ అడ్డాల మరో సంచలన చిత్రానికి తెరలేపారు.  

అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇందులో భాగంగా మొదటి భాగం ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు. మొదటి భాగానికి పెదకాపు 1 అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. 

ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటెన్స్ గా ఉంది. పోరాటానికి సిద్ధం అవుతున్న యువకుడిగా చేతిని పైకెత్తి విరాట్ కర్ణ కనిపిస్తున్నాడు. పోస్టర్ పై ఓ సామాన్యుడి సంతకం అనే క్యాప్షన్ కూడా ఉంది.  90 వ దశకం నాటి రాజకీయాలు.. గొడవల నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని ఇంటెన్స్ గా, బోల్డ్ గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తూ మరో బిగ్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి అని కూడా ప్రకటించారు. 

సాఫ్ట్ చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల నుంచి రాబోతున్న విభిన్నమైన ప్రయత్నం పెదకాపు అని చెప్పొచ్చు. కులం పేరుతో టైటిల్ పెట్టడంతో ఏదైనా వివాదం అవుతుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios