కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్ కి మంచి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుత జనరేషన్ కి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మల్టీస్టారర్ ని పరిచయం చేసిన ఈ దర్శకుడు బ్రమోత్సవం డిజాస్టర్ తరువాత సైలెంట్ అయిపోయాడు. అనంతరం పలు రీమేక్ లపై ద్రుష్టి పెట్టినట్లు కథనాలు వచ్చినప్పటికీ శ్రీకాంత్ నుంచి అఫీషియల్ రెస్పాన్స్ అయితే రాలేదు. 

అయితే ఆయనకు గీత అర్ట్డ్స్ మంచి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. తన మార్క్ కి తగ్గట్టుగా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీని రాసుకున్న శ్రీకాంత్ అడ్డాల సంక్రాంతి లోపు సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా 2020 జనవరిలో సినిమాను రిలీజ్ చెయ్యాలని గీత ఆర్ట్స్ కూడా గ్రీన్ సిగ్నల్ చ్చినట్లు టాక్. 

కుదిరితే సంక్రాంతికే సినిమాను విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. ఇంకా అఫీషియల్ గా కథానాయకుడు ఎవరనేది నిర్ణయించలేదు. న్యాచురల్ స్టార్ నాని అని అనుకున్నట్లు గత కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నప్పటికీ ఎంతవరకు నిజమో ఇంకా తెలియరాలేదు. త్వరలోనే ఈ సినిమాపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.