సారాంశం

 రగ్గ్‌డ్‌ లుక్‌, రక్తపాతంతో  టెర్రిఫిక్‌ విలనిజం పండించాడు సూర్య. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కూడా తన పాత్రలోనే కనిపించనున్నారని సమాచారం. 


మీకు గుర్తుందో లేదో అని అడగటానికి అదేమన్నా మర్చిపోయే పాత్రా ...‘రోలెక్స్‌ సర్‌’ అంటే ఇప్పటికీ అలా సూర్య కళ్ల ముందుకు కనపడతాడు. తెరపై కనిపించింది జస్ట్‌ కొన్ని నిమిషాలు.. అయినా దుమ్మురేపారు హీరో సూర్య. కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే రోలెక్స్‌ క్యారెక్టర్‌ ఏ రేంజిలో పేలిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రెడిట్‌ లోకీ అలియాస్‌ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌కే దక్కుతుంది. ఆ పాత్రను చాలా స్పెషల్‌గా.. అంతే క్రూరంగా డిజైన్‌ చేశాడు ఆ క్యారెక్టర్‌ను. ఇప్పుడు డైరక్టర్ శ్రీకాంత్ అడ్డాల సైతం తన తాజా చిత్రం #pedakapuలో అలాంటి రోలెక్స్ పాత్రనే పోషించారని సమాచారం. సినిమాలో అదే రేంజ్ లో పేలుతుందని సమాచారం. 

‘రోలెక్స్‌ సర్‌’ పాత్రను ఎటువంటి  ప్రకటన లేకుండా సైలెంట్‌గా షూటింగ్‌ పూర్తి చేసి సర్పైజ్ చేసాడు డైరెక్టర్‌ లోకేశ్‌. ఫొటోలు లీక్‌ కాకుంటే.. ఆ విషయం కూడా బయటకు పొక్కేది కాదు. అయితేనేం సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. క్లైమాక్స్‌లో వచ్చే సూర్య పోర్షన్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. రగ్గ్‌డ్‌ లుక్‌, రక్తపాతంతో  టెర్రిఫిక్‌ విలనిజం పండించాడు సూర్య. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కూడా తన పాత్రలోనే కనిపించనున్నారని సమాచారం. 

తను చేసే పాత్ర  కామియో అయినా మంచి ఇంపాక్ట్‌ చూపించేలా  ఆ క్యారెక్టర్‌ డిజైన్ చేసుకున్నారని తెలుస్తోంది.  సూర్య గతంలో 24 సినిమాలో నెగెటివ్‌ రోల్‌ చేసినా.. విక్రమ్‌ రోలెక్స్‌ మాత్రం టాప్‌ నాచ్‌ అనే చెప్పాలి. అందుకే ఆయన అభిమానులు కూడా రోలెక్స్‌ను తెగ ఎంజాయ్‌ చేసారు. అలాగే సున్నితమైన భావోద్వేగాలు గల సినిమాలు చేసే శ్రీకాంత్ అడ్డాల అలాంటి పాత్రలో కనిపించటం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుందని భావిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాలలో నటుడు కూడా ఉన్నారు. ఆ నటుడు ఇన్నాళ్ళు కేవలం అతిథి పాత్రలకు మాత్రమే పరిమితం అయ్యారు. అల్లు అర్జున్ 'ఆర్య'లో చిన్న పాత్ర చేశారు. వరుణ్ తేజ్ 'ముకుంద' చిత్రంలోని ఓ పాటలో కనిపించారు. 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ద్వారకా క్రియేషన్స్‌ సంస్థ తెరకెక్కిస్తోన్న సినిమా 'పెద్ద కాపు' (Peddha Kapu Movie). మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో విరాట్ కర్ణ (Virat Karrna), ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అడ్డాల ఓ ప్రధాన పాత్ర పోషించారు.