Asianet News TeluguAsianet News Telugu

అఖండ నిర్మాతతో శ్రీకాంత్ అడ్డాల పొలిటికల్ మాస్ మూవీ..కులం పేరుతో టైటిల్ ?

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. అప్పట్లో శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతంగా ఆకర్షించేవి. 

Srikanth Addala next movie title and first look release date fixed dtr
Author
First Published May 30, 2023, 6:57 PM IST

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. అప్పట్లో శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతంగా ఆకర్షించేవి. కానీ బ్రహ్మోత్సవం చిత్రంతో కథ అడ్డం తిరిగింది. ఆ చిత్ర పరాజయంతో శ్రీకాంత్ అడ్డాల చాలా కాలం కనిపించలేదు. 

తిరిగి వెంకటేష్ నారప్ప చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఫ్యామిలీ చిత్రాలు తెరకెక్కించే ఆయన నారప్ప లాంటి రా అండ్ రస్టిక్ మాస్ చిత్రాలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. అది రీమేక్ చిత్రం అయినప్పటికీ శ్రీకాంత్ అడ్డాలకి ప్రశంసలు దక్కాయి. కానీ ఆ చిత్రం ఓటిటిలో విడుదలైన సంగతి తెలిసిందే. 

మరోసారి నారప్ప తర్వాత కూడా శ్రీకాంత్ అడ్డాలకి గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం షురూ అయింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల కొత్త చిత్రం ఉండబోతోంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ జూన్ 2న రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

అయితే ఈ చిత్ర టైటిల్ విషయంలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి పెద కాపు అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాఫ్ట్ చిత్రాలు తెరకెక్కించే శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రంలో వయలెన్స్ కి, మాస్ యాక్షన్ కి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు, ఆ రకంగా కథ సిద్ధం చేసుకునట్లు టాక్. 90 వ దశకం నాటి రాజకీయాలు.. గొడవల నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారనే సమాచారం కూడా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios