Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాంత్ ‘కోట బొమ్మాళి పీఎస్’ నుంచి శ్రీకాకుళం ఫోక్ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే?

ప్రముఖ GA2 పిక్చర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ‘కోటబొమ్మాలి’ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ సాంగ్ రెడీ అవుతోంది. శ్రీకాకుళం ఫోక్ తో ఆకట్టుకోబోతున్నారు. పాటకు సంబంధించిన అప్డేట్ ను అందించారు. 
 

Srikakulam Folk song from Kota Bommali movie NSK
Author
First Published Sep 8, 2023, 1:49 PM IST

మలయాళ సూపర్ హిట్ ‘నాయాట్టు’కి రీమేక్ గా నిర్మిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’.  తెలుగులో ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు. శ్రీకాంత్ మేక (Srikanth Meka) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. 

ఇప్పుడు కోట బొమ్మాళి PS మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు మేకర్స్. మాస్సీ శ్రీకాకుళం ఫోక్లోర్ ఫస్ట్ సింగిల్  సెప్టెంబర్ 11న విడుదలవుతుందని ఈరోజు  ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఈ అప్డేట్ అందించారు. పూర్తిస్థాయి ఫోక్ సాంగ్ తో రానున్న ఈ పాట ప్రేక్షకుల్ని అలరిస్తుందని అన్నారు దర్శకర్మాతలు. జోహార్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న  తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇక తెలుగులో అనేక సినిమాలు నిర్మించి సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ.  అదేక్రమంలో GA2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు నిర్మించగా కొన్ని ఇతర భాషలు సినిమాలను కూడా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు కోట బొమ్మాళితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్ తోపాటు రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, ఇతర ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios