శ్రీహరి తనయుడు మేఘంష్ హీరోగా త్వరలో వెండితెరపై మెరవనున్నాడు. రాజ్ దూత్ అనే సినిమా ద్వారా పరిచయం కానున్న ఈ యువ హీరో ఫస్ట్ లుక్ తో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు. త్వరలో సినిమాకు సంబందించిన టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. 

శ్రీహరికి ఇద్దరు కుమారులు- మేఘంష్ శ్రీహరి - శశాంక్ శ్రీహరి. ఇప్పుడు మేఘంష్ కొత్త సినిమాతో  రెడీ అవుతున్నాడు. రొమాంటిక్ యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఆ సినిమాలో మేఘంష్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట.   కార్తీక్ - అర్జున్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 

వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ వర్క్ చేస్తోంది. త్వరలోనే సినిమాకు సంబందించిన టీజర్ ను రిలీజ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.