Asianet News TeluguAsianet News Telugu

తొడకొట్టి నా దమ్ము అంటూ రెచ్చిపోయిన శ్రీహాన్.. టాస్క్ గోవిందా, అంతా ఫిజికల్

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో రోజు రోజుకి ఇంటెన్సిటీ పెరుగుతోంది. ఈ క్రమంలో హౌస్ మేట్స్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఫిజికల్ ఫైట్స్ కి కూడా రెడీ అవుతున్నారు. 

Srihan and arjun kalyan ugly fight in bigg boss house
Author
First Published Oct 20, 2022, 11:05 PM IST

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6లో రోజు రోజుకి ఇంటెన్సిటీ పెరుగుతోంది. ఈ క్రమంలో హౌస్ మేట్స్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఫిజికల్ ఫైట్స్ కి కూడా రెడీ అవుతున్నారు.  ఎపిసోడ్ 47 మొత్తం ఫిజికల్ గానే సాగింది. ముందుగా నేటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ చేత ఒక ప్రతిజ్ఞ చేయించారు. 

కంటెస్టెంట్స్ ఆటతీరు మెరుగుపరుచుకునేలా ప్రతిజ్ఞ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. దీనితో ఒక్కొక్కరి వారి వారి స్టయిల్స్ లో ప్రతిజ్ఞ చేశారు. గీతూ మాత్రం బాహుబలి ప్రమాణ స్వీకారం తరహాలో ప్రతిజ్ఞ చేసి ఆకట్టుకుంది. 

అనంతరం బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో రెడ్ అండ్ బ్లూ టీమ్స్ తలపడతాయి. టాస్క్ ప్రకారం ఒక మెషిన్ లో నుంచి బొమ్మలు పూలు వస్తాయి. ఇరు టీములు ఆ పూలని బొమ్మలని పోటీపడి దక్కించుకోవాలి. దక్కించుకున్నవాటిని వారి ప్లేస్ లలో ఉంచుకోవాలి. 

పూలు, బొమ్మలు దక్కించుకునే క్రమంలో ఎక్కువ మంది సభ్యులు మెషిన్ వద్దే ఉండిపోయారు. దీనితో గందరగోళంగా మారింది. ఒకరిని ఒకరు తోసుకుంటూ.. పడుతూ లేస్తూ ఈ టాస్క్ ఆడారు. ఈ క్రమంలో శ్రీహన్, అర్జున్ కళ్యాణ్ మధ్య గొడవ జరిగింది. అర్జున్ కళ్యాణ్.. శ్రీహాన్ ని మెషిన్ వద్ద నుంచి లాగేసేందుకు ప్రయత్నించగా.. శ్రీహన్ కూడా అలాగే స్పందించాడు. 

ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. శ్రీహన్ తొడ కొడుతూ రెచ్చిపోయాడు. తాను ఇద్దరిని లాగాను అని, అది తన దమ్ము అంటూ శ్రీహాన్ గట్టిగా అరిచాడు. అలాగే శ్రీహన్ తో మెరీనాకి కూడా గొడవ జరిగింది. రేవంత్, శ్రీ సత్య మధ్య చిన్నపాటి మాటల యుద్ధం సాగింది. 

అర్జున్ కళ్యాణ్, శ్రీహాన్, రేవంత్, సూర్య , కీర్తి, వాసంతి లాంటి వారంతా  మెషిన్ కి దగ్గరగా చేరి దెబ్బలు తగులుతున్నా పట్టించుకోకుండా టాస్క్ ఆడారు. చివరికి తొలి రౌండ్ లో రెడ్ టీం విజయం సాధించింది. తదుపరి రౌండ్స్ కొనసాగుతున్నాయి. 

ఈ టాస్క్ లో విజయం సాధించిన టీం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు. పరాజయం చెందిన టీమ్ లో ఒక సభ్యులు నేరుగా నామినేట్ అవుతారు.   

Follow Us:
Download App:
  • android
  • ios