తన కూతుళ్లు సినిమాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్న శ్రీదేవి సినిమాలపై ఇష్టంతో ఉన్న అందాల తార కుమార్తెలు జాహ్నవి, ఖుషి కపూర్ అభిమానుల నుంచి వ్యతిరేకత రావటంతో అలా అనలేదని కవర్ చేస్తున్న శ్రీదేవి
నాలుగైదు రోజులకే అతిలోక సుందరి శ్రీదేవి ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. తన కూతుళ్లను సినిమా రంగానికి పరిచచయం చేయడం తనకకు అస్సలు ఇష్టంలేదని,.. పిల్లలు పెళ్లిచేసుకుని హాయిగా పిల్లా పాపలలతో జీవించాలని కోరుకుంటున్నాని చెప్పింది. దీంతో ఆరుపదులకు దగ్గరవుతున్న శ్రీదేవి మనస్తత్వం సరిగా లేదని కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియాలో రివర్స్ గేర్ వేసారు. అంతేకాదు.. తమ అభిమాన హీరోయిన్ పిల్లలు పెళ్లి చేసుకుంటే... వెండితెరపై మెరవకుండానే అత్తారింటికి వెళ్లిపోతే... మా గతేంకాను అని అభిమానులు తెగ హడావుడి చేసేసారు..
శ్రీదేవి నోటి నుంచి ఏ మాటల్ని వినకూడదనుకున్నామో అవే మాతలు ఆమె మాట్లాడటంతో అంతా తిట్టిపోశారు. పిల్లల కెరీర్ మీద కాకుండా ఈ పెళ్లి గోలేందంటూ విమర్శలు చేశారు. మామూలుగా అయితే ఈ మాటల్ని శ్రీదేవి పట్టించుకునేది కాదేమో. కానీ.. తాను తాజాగా నటించిన మామ్ సినిమా విడుదల ముందు ఇలాంటివి రచ్చ జరిగే నష్టం భారీగా ఉంటుందని ఫీలయ్యారో ఏమో కానీ..డ్యామేజ్ కంట్రోల్ మొదలెట్టేశారు.
తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పిన శ్రీదేవి.. ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడాలన్నదే తన ఉద్దేశం ఎంతమాత్రం కాదని పేర్కొన్నారు. వారి కాళ్లపై వారు నిలబడి.. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తాను కోరుకుంటానన్నారు. తాను అదే విషయాన్ని పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటానని.. వారికి నచ్చింది చేసే హక్కు వారికుందని చెప్పుకుంది.
ఇండస్ట్రీలో ఉండే బిజీ లైఫ్ హ్యాండిల్ చేసుకోలేకపోతే.. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మొదటి నుంచి అనుకుంటున్నానని.. అయితే వారు సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారు కాబట్టి.. వారి నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పుకొచ్చింది. కొందరేమో మామ్ సినిమా పబ్లిసిటీ కోసమే ఇలాంటి సెన్సేషనల్ కమెంట్ చేసి శ్రీదేవి అడ్డంగా బుక్కయిందని అంటున్నారు. పబ్లిసిటీ కోసమే అయితే ఇలా వివరణ ఇచ్చి ఉండాల్సిన అవసరం ఏముంది. మరి కొంత కాలం ఇదే హాట్ టాపిక్ గా ఉండేది.
