భర్త బోని అంటే శ్రీదేవికి ఎంత ఇష్టమో తెలిపే విషయాలను మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. బోనిపై శ్రీదేవి ప్రేమను వ్యక్తం చేస్తూ చేసిన ఓ హావభావం అందర్ని కట్టిపడేస్తున్నది. ఆ వివరాలు మీకోసం.2013లో లక్నోలో జరిగిన దుర్గాపూజలో శ్రీదేవి, బోనికపూర్ దంపతులు పాల్గోన్నారు. ఆ కార్యక్రమంలో సింధూర్ మేళా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా తన వీపుపై సింధూరంతో బోనికపూర్ పేరును శ్రీదేవి రాసుకొని తన ప్రేమను వ్యక్తం చేశారు.లక్నో దుర్గాపూజను గుర్తుచేసుకొంటూ.. నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఇప్పటివరకు దుర్గాపూజలో పాల్గొనలేదు. తొలిసారి దుర్గమాత సన్నిధిలో గడిపాను. చాలా సంతోషభరితమైన క్షణాలు అవి అని శ్రీదేవి పేర్కొన్నారు.భార్యగా నన్ను ప్రతిక్షణం నా గురించి, నా ఆనందం గురించి ఆలోచించేది. కుటుంబంలో తన పాత్రను పూర్తిస్థాయిలో ప్రభావవంతంగా పోషించింది. నేను ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా.. దాని వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేది.కెరీర్ పరంగా నేను పడిపోయినా.. ఉన్నత స్థానంలో నిలిచినా తనకే సంభవించినట్టు బాధపడిపోయేది. సంతోషపడేది. మా ఇద్దరి మధ్యలో ఉండే స్ఫూరిగా చాలా ఆహ్లాదకరంగా ఉండేది.శ్రీదేవికి దైవభక్తి ఎక్కువ. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని మా ఇంటి నుంచి సిద్ధి వినాయక్ ఆలయం వరకు పాదరక్షలు లేకుండా నడిచివెళ్లేది. నాకు మంచి జరుగాలని ఆమె ఎప్పుడు దేవుడ్ని ప్రార్థించేదిని బోనికపూర్ తన మనసులో మాటను పంచుకొన్నారు.