ప్రముఖ సినీ నటి శ్రీదేవి గతేడాది దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం పలు అనుమానాలకు దారి తీసింది. పోలీసులు ఆమె బాత్ టబ్ లో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయిందని రిపోర్ట్ ఇచ్చినప్పటికీ చాలా మంది ఆమె మరణం ప్రమాదం కారణంగా జరగలేదని, హత్య చేశారని సందేహాలు వ్యక్తం చేశారు.

2018, ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించింది. అప్పటినుండి ఆమెది హత్య అని వాదించేవారు ఇంకా తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా కేరళ జైల్ డీజీపీ రిషిరాజ్ సింగ్ కూడా శ్రీదేవి మరణం ప్రమాదం కాదని హత్య చేశారని అన్నారు.

ఈ స్టేట్మెంట్ విన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని కేరళకు చెందిన ప్రముఖ న్యూస్ పేపర్ పబ్లిష్ చేసింది. ఈ క్రమంలో రిషిరాజ్ మాట్లాడుతూ.. ''నా స్నేహితుడు ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదతాన్.. శ్రీదేవిని హత్య చేసి చంపేశారనే విషయాన్ని తెలిపాడు. అలానే అది మర్డర్ అనే విషయాన్ని తెలిపే విధంగా ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాడు'' అంటూ వెల్లడించారు. 

ఫోరెన్సిక్ అధికారి పాయింట్ ఆఫ్ వ్యూలో.. శ్రీదేవి నిజంగానే ఎక్కువగా మద్యం సేవించి ఉంటే కేవలం ఒక అడుగు లోతు మాత్రమే ఉన్న బాత్ టబ్ లో మునిగి చనిపోయే అవకాశం లేదని అంటున్నారు. ఆమెను వెనుక నుండి ఎవరైనా ముంచి చంపేసి ఉంటారని తనకున్న సందేహాన్ని వెల్లడించాడు రిషిరాజ్. ఈ మాటలు శ్రీదేవి అభిమానులను మరింత బాధకి గురి చేస్తున్నాయి. ఆమె చావు మిస్టరీగా మిగిలిపోతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.