శ్రీదేవిని పెళ్లి చేసుకొమ్మని ఆమె నన్ను అడిగారు: డా.రాజశేఖర్

Sridevi Mother asked Rajashekar to marry her daughter
Highlights

  • నేనంటే శ్రీదేవి తల్లికి చాలా ఇష్టం.
  • శ్రీదేవిని పెళ్లి చేసుకొమ్మన్నారు.

శ్రీదేవి మరణ వార్త విని షాక్ అయ్యానని ప్రముఖ నటుడు, డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి కుటుంబంతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్ అడ్వొకేట్ అయితే, తన తండ్రి పోలీసు అధికారి కావడంతో వారిద్దరూ ఒకేచోట పని చేసేవారని, దీనికి తోడు దూరపు బంధుత్వం కూడా ఉండడంతో మంచి స్నేహితులుగా మారారని అన్నారు.శ్రేదేవి తల్లికి తానంటే బాగా ఇష్టమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీదేవిని పెళ్లి చేసుకొమ్మని తనను కోరారని ఆయన అన్నారు. అయితే ఆమె సినిమాల్లో ఉందన్న కారణంతో... తాను ఎమ్మెస్ చదవాలన్న కారణం చెప్పి, వివాహాన్ని తిరస్కరించారని రాజశేఖర్ తెలిపారు. సినిమావాళ్లను పెళ్లి చేయడం ఇష్టం లేక తన కుటుంబ సభ్యులు శ్రీదేవితో పాటు ఆమె చెల్లి శ్రీలతతో కూడా వివాహానికి నిరాకరించారని రాజశేఖర్ వెల్లడించారు.

loader