ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బ్యూటీ శ్రీదేవి మరణించి రోజులు గడుస్తున్నా ఎదో ఒక విషయం ఆమె గురించి వైరల్ అవుతునే ఉంది.  రీసెంట్ గా శ్రీదేవి మరణం అనంతరం చివరి కార్యక్రమం కూడా ముగిసింది. కుటుంబ ఆచారాల ప్రకారం మార్చ్ 3వ తేదీన ఆమె అస్థికలను రామేశ్వరంలో కలిపారు. బోణి కపూర్ తో పాటు శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి - ఖుషి కూడా చివరి తంతులో తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముగ్గురు తెల్లని దుస్తుల్లో శ్రీదేవికి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంలో బోనీ కపూర్ కాస్త కోలుకున్నట్లే కనిపించినా.. జాహ్నవి అండ్ ఖుషీ మాత్రం బాగా కుంగిపోయారని వారిని చూస్తేనే అర్దమవుతోంది.