ఎంతో ఆరోగ్యంగా, హెల్తీగా ఉన్న శ్రీదేవి హఠాన్మరణం చెందడం అందరినీ షాక్‌కు గురి చేసింది. భారత దేశ సినీ పరిశ్రమ, ప్రతి భారతీయ సినీ అభిమానికి ఆదివారం ఉదయం శ్రీదేవి మరణం వార్త వింటూ నిద్రలేచారు. అయితే శ్రీదేవి మరణం విషయంలో ఓ షాకింగ్ కోఇన్సిడెంట్ చర్చనీయాంశం అయింది. నిర్మాత

శ్రీదేవి కంటే ముందు మోనాను పెళ్లాడారు. శ్రీదేవితో ప్రేమలో పడ్డ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. అయితే మోనా, శ్రీదేవి మరణం సమయంలోని పరిస్థితులు ఒకే విధంగా ఉండటం చర్చనీయాంశం అయింది.మోనా కపూర్ క్యాన్సర్ వ్యాధి బారిన పడి 2012లో మరణించారు. బోనీ-మోనా కుమారుడు అర్జున్ కపూర్ అప్పుడే ‘ఇషక్‍‌జాదే' సినిమా ద్వారా తెరంగ్రేటం కాబోతున్నాడు. మరో రెండు నెలల్లో తన కుమారుడి సినిమా విడుదల ఉందనగా మోనా మరణించారు. కొడుకును తెరపై హీరోగా చూడక ముందే మోనా కన్ను మూశారు.ప్రస్తుతం శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ‘ధడక్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా మరో నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే జాహ్నవిని హీరోయిన్‌గా తెరపై చూడక ముందే శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. శనివారం అర్ధరాత్రి శ్రీదేవి గుండె పోటుతో మరణించారు.బోనీ కపూర్ ఇద్దరి భార్యల విషయంలో ఒకే విధమైన పరిస్థితులు నెలకొనడం, తమ వారసుల తెరంగ్రేటాన్ని చూడకముందే వారు కన్నుమూయడం ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తోంది.