శ్రీదేవి బోనీకపూర్ పెళ్లి టైంకి ఆమె వద్ద పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. చిన్నతనం నుండి తను నటించిన సినిమాల ద్వారా బాగానే సంపాదించింది. తల్లి అనవసరపు ఇన్వెస్ట్మెంట్స్ చెల్లి మోసం చేయడం వలన దాదాపు ఆస్తి మొత్తం కొల్పోయింది. కేవలం నాటుగేళ్ల వయసు నుండే బాలనటిగా తేరంగ్రేటం చేసి అద్బుత నటనతో స్టార్ మీరోయిన్ స్థాయికి ఎదిగింది.

 

కానీ శ్రీదేవి బోనీకపూర్ వివాహ సమయానికి ఆమెకు ఆస్తులేమి మిగలలేదు. చిన్నప్పటి నుండి తన సినిమాల గురించి రెమ్యునరేషన్ గురించి ఆమె తండ్రి చూసుకునేవాడు, నర్మాతలు బ్లక్ మనీ ఇస్తుండటంతో తనకు నమ్మకమైన స్నేహితులు బంధువులు వద్ద ఉంచారు. అయితే ఆయన మరణం తర్వాత చాలా మంది డబ్బు తిరిగి ఇవ్వక చాలా మంది మోసం చేశారు. తండ్రి మంణం తర్వాత డబ్బు వ్యవహారాలు తల్లి చూసుకునేవారు. ఆమె శ్రీదేవి డబ్బుతో చాలా వరకు లిటికేషన్ లో ఉన్న ఆస్తులు కొనుగోలు చేయడంతో తీవ్రంగా నష్టపోయారు. బోనీకపూర్ ను పెళ్లాడే సమయానికి ఆమె వద్ద పెద్దగా ఆస్తుల్లేవని అంటుంటారు. శ్రీదేవి సోదరి తన పొరిగింటి కుర్రాడిని పారిపోయి పెళ్లి చేసుకుంది. దాంతో  శ్రీదేవి డబ్బుతో తన పేరు మీద కొనుగోలు చేసిన ఆస్తులను మళ్లీ శ్రీదేవి పేరుమీద రాస్తు తల్లి వీలునామా రాసింది. తర్వాత శ్రీదేవి తల్లికి బ్రేయిన్ ఆపరేషన్ తప్పుగా జరగడంతో ఆమె మెంటల్ పేషంట్ అయ్యారు.

 

అనంతరం శ్రీదేవి సోదరి ఆస్తుల పై కోర్టుకెక్కారు. తన తల్లి మతిస్థిమితం లేని సమయంలో వీలునామా రాశారని శ్రీదేవికి ఉన్న కొద్దిపాటి ఆస్తుల్లో సగం లాక్కున్నారు. బోనీకపూర్ తో వివాహం తర్వాత శ్రీదేవి సినిమాలకు సినిమాలకు దూరమైన సంగతి తెల్సిందే. లక్స్ తనిష్క లాంటి బ్రాండ్లకు ప్రచారం చేసి మంచి ఆదాయన్ని సంపాదించుకున్నారు. శ్రీదేవి బోనీకపూర్ నివాసం ముంబాయిలోని అందేరి ప్రాంతంలో ఉంది. ఇక్కడ వారికి విలాసంతమైన భవంతి ఉంది ఆ ఇంటి కరీదు 220 కోట్లు ఉంటుందని అంచనా. రీ ఎంట్రీ తర్వాత ఆమె ఆస్తి పదకొండు కోట్లు ఉంటుందని అంచనా. శ్రీదేవి కుటుంబానికి పలు ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులో రెండు కోట్లు విలువ చేసే బెంట్లీ కారు కూడా ఉంది.అవన్నీ శ్రీదేవి పేరు మీదే ఉన్నాయి. ఈ కర్ల విలువ తొమ్మిది కోట్లు ఉండచ్చని అంచనా. శ్రీదేవి పేరు మీద 620 కోట్ల విలువ చేసే బంగళాలు ఉన్నట్టు సమాచారం. శ్రీదేవి సంబందించిన ఆస్తులన్నీ శ్రీదేవి కూతుళ్లకు సమానంగా చెందుతుందని సమాచారం.