ఇఫీ వేడుకల్లో సందడి చేసిన తల్లీకూతుళ్లు శ్రీదేవి, జాహ్నవి

First Published 21, Nov 2017, 3:21 PM IST
sridevi daughter jhahnavi special attraction in ifi2017
Highlights
  • త్వరలో అందాల తార శ్రీదేవి, బోనీకపూర్ ల కూతురు జాహ్నవి వెండితెర ఆరంగేట్రం
  • దఢక్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న జాహ్నవి
  • తాజాగా ఇఫీ2017లో సందడి చేసిన జాహ్నవి, శ్రీదేవిో

జులైలో బాలీవుడ్ మూవీ దఢక్ తో వెండితెరపై అరంగేట్రం చేయనున్న అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి, తన తల్లిదండ్రులతో కలిసి గోవాలోని ఇంటర్మనేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై సందడి చేసింది. ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో బోనికపూర్‌, శ్రీదేవి, జాహ్నవి కపూర్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇఫీ2017 ప్రారంభవేడుకలో దేశ విదేశాలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు.

 

ఇఫీ2017 వేడుకల్లో శ్రీదేవి ఇండియన్ పనోరమా విభాగాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, కేంద్రమంత్రి మనోహర్ పారికర్ తదితరులు పాల్గొన్నారు. ఇఫీ వేడుకల్లో శ్రీదేవి కూతురు తన అందచందాలతో చూపరులను ఆకట్టుకుంది. ప్రారంభ వేడుక అనంతరం మీడియా పాయింట్ వద్ద బోనికపూర్ కుటుంబం హడావిడి చేసింది.

 

జాహ్నవి కపూర్ త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నది. కరణ్ జోహర్ నేతృత్వంలో మరాఠీ చిత్రం సైరాత్ హిందీ రీమేక్‌ దఢక్ చిత్రం ద్వారా జాహ్నవి పరిచయం కానుంది. 2018 జూలై 6న దఢక్ చిత్రం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

loader