ఒక జనరేషన్ అభిమానాన్ని పొందిన సెలబ్రిటీలు.. సినీప్రముఖులు.. తర్వాతి జనరేషన్స్ వారు అభిమానించటం చాలా అరుదు. అలాంటి అరుదైన అభిమానం పొందిన ఘనత అతిలోక సుందరి శ్రీదేవిదే. ఆఖరి శ్వాస వరకూ అతిలోక సుందరిగా ఉండటం అందరికి సాధ్యం కాదేమో. అప్పటివరకూ హుషారుగా.. చలాకీగా తిరిగిన శ్రీదేవి.. అంతలోనే గుండెనొప్పి రావటం.. తీవ్ర అసౌకర్యానికి గురి కావటం.. ఆ వెంటనే కుప్పకూలిపోవటం జరిగిపోయాయి.ఏం జరిగిందో అర్థమయ్యే లోపే శ్రీదేవి ప్రాణాలు పోయినట్లుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆమె మరణం షాకింగ్ గా మారింది. వేడుకలో అప్పటివరకూ హ్యాపీగా ఉన్న ఆమె ఒక్కసారిగా ఇక ఎప్పటికి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారన్న ఆలోచన వేదనగా మార్చటమే కాదు.. గుండెలు పిండేసేలా చేస్తున్నాయి.చివరి శ్వాస విడవటానికి కొద్దిసేపు ముందు.. ఆమె వేడుకలో దిగిన చివరి ఫోటో తాజాగా బయటకు వచ్చింది. అతిలోక సుందరి అని ఆమెను అభిమానించే వారంతా.. ప్రాణం విడవటానికి కొద్దిక్షణాల ముందు అలానే ఉండి వెళ్లటం చూస్తే.. అనిపించేది ఒక్కటే.. స్వర్గంలో దేవదేవుడి అస్థానంలో అతిలోక సుందరికి ఏదో అయి ఉంటుంది. ఆ లోటు తీర్చుకోవటం ఎలా అనుకున్నంతనే మన శ్రీదేవిని గుర్తుకు వచ్చి ఉంటుంది. అంతే.. క్షణాల్లో ఆమె మనల్ని వీడి వెళ్లిపోయి ఉంటుంది. శ్రీదేవి ఆఖరి ఫోటో ఇదే..