రామేశ్వరంలో శ్రీదేవి అస్తులు కలిపిన కుటుంబసభ్యులు

First Published 3, Mar 2018, 9:40 AM IST
sridevi ashes immersion in rameswaram
Highlights
  • రామేశ్వరంలో శ్రీదేవి అస్తులు కలిపిన కుటుంబసభ్యులు

అతిలోక సుందరి శ్రీదేవి అస్థికలను రామేశ్వరంలో నిమజ్జనం చేసేందుకు శనివారం తన కుటుంబసభ్యుతలో కలిసి బోనీ కపూర్ రామేశ్వరం చేరుకున్నారు. అక్కడ శ్రీదేవి అస్థికలను నిమజ్జనం చేయనున్నారు. అనంతరం శనివారం రాత్రే వారంతా ముంబయికి తిరిగి ప్రయాణం కానున్నారు. శ్రీదేవి అస్థికలను తీసుకుని ఆమె కుటుంబంసభ్యులు ప్రత్యేక విమానంలో చెన్నైకు చేరుకుని, అక్కడ నుంచి మరో విమానంలో రామేశ్వరానికి చేరుకున్నట్టు సమాచారం.
 

దక్షిణాది నుంచి బాలీవుడ్ దాకా ఐదు దశాబ్దాలకు పైగా తన నటనతో మెప్పించిన దేవకన్య గత శనివారం రాత్రి దుబాయ్‌లో హఠాత్తుగా మరణించారు. ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి, మృతి చెందినట్లు దుబాయ్ వైద్యులు నిర్ధారించారు. బుధవారం ముంబయిలోని విల్లే పార్లే సమాజ్‌ సేవా హిందూ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. శ్రీదేవి అంతిమ యాత్రలో సినీ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు పాల్గొని ఆమెకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.
 

తన భార్య శ్రీదేవి మృతి పట్ల బోనీకపూర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచానికి ఆమె చాందిని, అద్భుత నటి. కానీ తనకు మాత్రం స్నేహితురాలని ఆమె ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం తన ముందున్న సమస్య శ్రీదేవి లేకుండా ఇద్దరు పిల్లలతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలన్నదేనని.. అదే తనను ఆందోళనకు గురిచేస్తోందని బోనీ వాపోయారు. పిల్లలకు అన్నీ తానై ముందుకు సాగింది.. ఆమే మా జీవితం, మా బలం.. భరించలేని ఈ నష్టాన్ని ఎదుర్కోవడానికి ఒక కుటుంబంగా మేము కలిసి ప్రయత్నించాం.. శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం అంటూ బోనీ ట్వీట్ లో పేర్కొన్నారు.

loader