Asianet News TeluguAsianet News Telugu

ఆ ఇద్దరు ఉంటే శ్రీదేవి బతికేదేమో

  • శ్రీదేవి ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను శోకసంద్రంలో ముంచింది.
  • శ్రీదేవి దుబాయ్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ​
Sridevi Advices to her Daughters

శ్రీదేవి ఆకస్మిక మరణం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను శోకసంద్రంలో ముంచింది. సినీలోకానికి కాకుండా తన కుటుంబానికి కూడా తీరని అన్యాయం చేసింది. తన కూతురు సినీరంగ ప్రవేశాన్ని కళ్లారా చూడకుండానే మళ్లీ రాని లోకాలకు తరలివెళ్లింది. శనివారం రాత్రి అందాల తార శ్రీదేవి దుబాయ్‌లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. శ్రీదేవి చివరిక్షణాల్లో కూతుర్లేవరూ లేకపోవడం విషాదంగా మారింది.శ్రీదేవికి తన కూతుళ్లు జాహ్నవి, ఖుషీ కపూర్ అంటే ఎనలేని ప్రేమ. ఓ తల్లిగానే కాకుండా వారితో స్నేహంగా ఉండటం తెలిసిందే. ప్రతీ విషయంలోను కూతుళ్లకు వెన్నంటి ఉండటం శ్రీదేవీ చేసేది. వారి భవిష్యత్తు కోసం తన కెరీర్‌నే త్యాగం చేసింది.తన తల్లిని జాహ్నవి, ఖుషీకపూర్‌లు ఎల్లవేళలా కంటికి రెప్పలా చూసుకొనేవారు. తనకు ఆరోగ్యం గురించి, తన సంరక్షణపై బాధ్యతగా మెసులుకొంటారని పలుమార్లు శ్రీదేవి చెప్పిన విషయం తెలిసిందే.తన మేనల్లుడు మోహిత్ మార్వా పెళ్లికి హాజరైన సమయంలో జాహ్నవి ఆ కార్యక్రమానికి దూరంగా ఉంది. దడక్ సినిమా షూటింగ్ బిజీ కారణంగా జాహ్నవి పెళ్లికి వెళ్లకపోయిన సంగతి తెలిసిందే. పెళ్లికి హాజరైన ఖుషీ ఆ తర్వాత తండ్రితో కలిసి ముంబైకి వెళ్లింది. ఏదో కారణంగా శ్రీదేవి అక్కడే ఉండిపోయింది.అయితే ఆ సమయంలోనే ఒత్తిడి కారణంగా శ్రీదేవి ఆరోగ్యం విషమించిందా? అనారోగ్యాన్ని ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టిందా అనేది విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తనతోపాటు కూతుళ్లు ఉండి ఉంటే శ్రీదేవి బతికి ఉండేదేమో అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.బాలీవుడ్ తెరకు పరిచయం అవుతున్న జాహ్నవికి శ్రీదేవి ఎన్నో సలహాలు ఇచ్చేదట. నటిగా రాణించడానికి, ఆకట్టుకోవడానికి ఎలాంటి పద్దతులు అనుసరించాలో క్లియర్‌గా చెప్పేదట.కెరీర్ ఆరంభంలోనే జాహ్నవికి శ్రీదేవి తోడు లేకపోవడం చాలా ఇబ్బందైన విషయం. మరాఠీ భాషలో ఘన విజయం సాధించిన సైరత్ సినిమా ఆధారంగా జాహ్నవి దడక్ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రం జూలై 6న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios