తన వ్యాఖ్యలతో, సోషల్ మీడియా పోస్ట్ లతో సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి ఈ మధ్యన కాస్త సైలెంట్ గా ఉన్నారు. లారెన్స్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే హఠాత్తుగా మరోసారి ఆమె విరుచుకుపడ్డారు.  ఈ సారి తమిళ ఇండస్ట్రీలో వెలుగుతున్న ఓ హీరోని ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ సంచలనాలకు తెరలేపింది.

 నడిగర్ సంఘం, తమిళ నిర్మాతల మండలిలో కీలకమైన పొజిషన్లో ఉన్న ఓ హీరోను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చారు. దాంతో ఆమె ఇప్పుడు తమిళ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు.  ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ అందరినీ మాట్లాడుకునేలా చేస్తోంది.  నడిగర్ సంఘాన్ని రూల్ చేస్తున్న హీరో ని టార్గెట్ చేసారామె. సదరు హీరో నడిగర్ సంఘంతో పాటు తమిళ ప్రొడ్యూసర్స్ సంఘంలో కూడా కీలక పదవిలో ఉన్నాడని ఆమె క్లూలు ఇచ్చింది.


 హీరోయిన్లతో పాటు సైడ్ యాక్టర్లను సెక్సువల్ ఫేవర్ కోసం వేధిస్తుంటాడని ఆమె ఆరోపించారు. అయితే మీడియా ముందు మాత్రం చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటాడని, మిస్టర్ పర్పెక్టులా ఫోజులు కొడుతుంటాడని, అతడు  మీడియా ముందు మాట్లాడిన తీరు చూశానని, అతడో మిస్టర్ పర్ఫెక్ట్ కాదు... మిస్టర్ ఫేక్ పర్ఫెక్ట్ అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

నిర్మాతల మండలిలో తనకు ఉన్న అధికారంతో చిన్న నిర్మాతలను డబ్బు కోసం వేధిస్తున్నాడని, త్వరలోనే అతడి నిజస్వరాన్ని ఆధారాలతో బయట పెడతాను అని శ్రీరెడ్డి అన్నారు.

తమిళ  నిర్మాతలందరూ నిన్ను నమ్మి నీకు ఓటు వేస్తే....  నువ్వు నీ అధికారాన్ని దుర్వినయోగం చేశావ్.   నిర్మాతలను డబ్బు కోసం వేధించావు. ఒక విషయం  గుర్తుంచుకో... వారి కోపం కట్టలు తెంచుకునే వరకే నువ్వు సేఫ్. ఆ తర్వాత నీ ఎమ్మెల్యే సీటు, నీ హీరో సీటు అన్నీ పోతాయి. అయినా  నీకు ఇంకా ఎంత డబ్బు కావాలి? ఎంత మంది చిన్న నిర్మాతలు నీ వల్ల స్ట్రగల్ అవ్వాలి. నిన్ను చూస్తే సిగ్గేస్తోంది... అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు. 

ఇక నువ్వు నెం.1 బ్లాక్ మెయిలర్. నీ బండారం బయట పెట్టడానికి అన్నీ సెట్ చేశాం. కౌంట్ డౌన్ స్టార్ ...జై జయలలితమ్మా అంటూ శ్రీరెడ్డి హెచ్చరించారు.

ఇవన్నీ చదివిన వాళ్లు ఇట్టే ఆ హీరో ఎవరో గుర్తించగలగుతున్నారు. చాలా మంది ఆమె పోస్ట్ క్రింద ఆ హీరో పేరుని మెన్షన్ చేస్తున్నారు. తెలుగులోనూ రెగ్యులర్ గా ఆ హీరో సినిమాలు రిలీజ్ అవుతాయని, రీసెంట్ గా కూడా ఒకటి రిలీజ్ అయ్యిందని , ఆ చిత్రం ప్రమోషన్ కోసం హైదరాబాద్ కూడా వచ్చాడని గుర్తు చేస్తున్నారు.