కాస్టింగ్ కౌచ్ విషయంలో టాలీవుడ్ పెద్ద దుమారాన్ని రేపిన నటి శ్రీరెడ్డి చాలా మందిని టార్గెట్ చేసి ఆరోపణలు చేసింది. మొన్నా మధ్య కోలివుడ్ లో ఛాన్స్ వచ్చిందని చెన్నైకి మకాం మార్చిన ఈమె మళ్లీ హైదరాబాద్ కి వచ్చింది.

వచ్చిన వెంటనే మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం మొదలుపెట్టింది. సినీ ప్రముఖులపై, రాజకీయ నాయకులపై విమర్శలు చేస్తూ కాలం గడుపుతోంది. తాజాగా ఆమె రాజకీయాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేసింది.

తనకు రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తి ఉందని, అయితే ఈసారి ఎన్నికలు కాకుండా వచ్చే ఎన్నికల్లో పాల్గొంటానని చెప్పింది. అయితే ఏ పార్టీలో జాయిన్ అవుతారనే విషయంపై స్పష్టతనివ్వలేదు.

ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా మహిళలకు ప్రాధాన్యతనివ్వడం లేదని, వ్యక్తిగతంగా తను జగన్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నా.. ఆ పార్టీలో కూడా మహిళలకు పెద్దగా ప్రాధాన్యత లేదని స్పష్టం చేసింది.