కత్తి మహేష్ ఓకే.. మరి శ్రీరెడ్డి సంగతేంటి..?

sri reddy supports katthi mahesh
Highlights

కత్తి మహేష్ బహిష్కరణ పట్ల శ్రీరెడ్డి అసహనం వ్యక్తం చేసింది. ఒక దళితుడికి దక్కే హక్కు ఇదేనా అంటూ ప్రశ్నించింది. స్వప్రయోజనాల కోసం కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని అతడిని వెనకేసుకొచ్చింది. కావాలని చేస్తోన్న ఇటువంటి విషయాలపై ప్రజలు రెచ్చిపోకుండా సహనంతో ఉండాలని కత్తి మహేష్ కనిపిస్తే గౌరవంగా మాట్లాడాలని చెబుతోంది

ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ హిందువులు ఆరాధించే రామాయణం, రాముడు మీద అనుచితవ్యాఖ్యలు చేయడంతో అతడిపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. సినీ, రాజకీయ నాయకులతో పాటు కొందరు స్వామీజీలు సైతం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆరు నెలల పాటు అతడిని సిటీ నుండి బహిష్కరించారు. ఈ విషయంలో కత్తి మహేష్ ను సపోర్ట్ చేస్తోన్న అతడి తక్కువ మందిలో శ్రీరెడ్డి కూడా ఉంది.

కాస్టింగ్ కౌచ్ గురించి పోరాడుతున్నానని చెప్పుకుంటోన్న శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూనే ఉంది. కత్తి మహేష్ బహిష్కరణ పట్ల ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఒక దళితుడికి దక్కే హక్కు ఇదేనా అంటూ ప్రశ్నించింది. స్వప్రయోజనాల కోసం కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని అతడిని వెనకేసుకొచ్చింది. కావాలని చేస్తోన్న ఇటువంటి విషయాలపై ప్రజలు రెచ్చిపోకుండా సహనంతో ఉండాలని కత్తి మహేష్ కనిపిస్తే గౌరవంగా మాట్లాడాలని చెబుతోంది.

అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు కత్తి మహేష్ కు సపోర్ట్ చేస్తున్నందుకు నిన్ను కూడా రాష్ట్రం నుండి బహిష్కరించాలి అంటూ ఆమెపై విరుచుకుపడ్డారు. కత్తి మహేష్, శ్రీరెడ్డి రెండు చీడపురుగులు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కత్తితో పాటు శ్రీరెడ్డిని కూడా ప్రభుత్వం బహిష్కరించాలని కోరుకుంటున్నామని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. 

loader