అమెరికా సెక్స్ రాకెట్ వివాదం రోజురోజుకి ముదిరిపోతుంది. టాలీవుడ్ కు చెందిన తారలు ఈ సెక్స్ రాకెట్ లో ఉండడంతో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. ఒక్కొక్కరుగా ఈ విషయంపై స్పందిస్తున్నా.. ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కిషన్ దంపతులను పోలీసులు అదుపులో తీసుకొని విచారించడంతో ఒక్కొక్కరి వ్యవహారం బయటపడుతోంది. ఇప్పటికే ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించిన నటి శ్రీరెడ్డి తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ లో ఈ సెక్స్ రాకెట్ పై సంచలన కామెంట్స్ చేసింది. తారలను అమెరికా తీసుకెళ్లి వ్యభిచారం చేయించడంలో కోఆర్డినేటర్లు కీలకపాత్ర పోషిస్తారని చెప్పుకొచ్చింది. యంగ్ హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు ఇలా ఒక్కొక్కరి స్థాయిని బట్టి ఒక్కో రేట్ ఉంటుందని తెలిపింది.

మూడు వేల డాలర్ల నుండి పది వేల డాలర్ల వరకు బిజినెస్ జరుగుతుందని వెల్లడించింది. టాలీవుడ్ తో పాటు ఇతర భాషలకు చెందిన తారలు కూడా  ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారని బాలీవుడ్ నటీమణులు కూడా దుబాయ్, అమెరికా వంటి ప్రాంతాల్లో సెక్స్ రాకెట్ లో భాగస్తులని స్పష్టం చేసింది.