నాగబాబుపై సంచలన కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి

First Published 18, Apr 2018, 1:59 PM IST
Sri reddy sensational comments on naga babu
Highlights

 సైకియాట్రిస్టు దగ్గరకు వెళ్లి చూపించుకో నాగబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నటి శ్రీ రెడ్డి చేసిన వాఖ్యలపై పవన్ అన్నయ్య నాగబాబు గత కొద్దిసేపటి క్రితమే మీడియా ద్వారా స్పందించిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో నాగబాబు చేసిన వాఖ్యలపై శ్రీ రెడ్డి కౌంటర్ ఇచ్చింది.ఈ సందర్భంగా తన పేస్ బుక్ ఖాతాలో సంచలన పోస్ట్ పెట్టింది. ‘మానవతా వాదినంటున్న నాగబాబు మాటలు ఎంత దయనీయంగా ఉన్నాయి. మీరు మానవతావాదివని అనుకుంటున్నారా? మీకు దయ ఉందా? ఓ మై గాడ్.. మీరు దయార్ధ్ర హృదయులు కాదు.. మీరు ఎంతో క్రూరులు. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెబుతాను వేచి చూడండి. మీర్ పర్ఫెక్ట్ అని భావిస్తున్నారా? మీరు సంపూర్ణంగా పర్ఫెక్ట్ కాదు… సైకియాట్రిస్టు అవసరం ఎవరికి ఉందో చెబుతాను..’అని శ్రీ రెడ్డి పోస్ట్ చేసింది.
 

                   

loader