కారునే పడకగదిగా మారుస్తున్నారు.. శ్రీరెడ్డి సంచలన కామెంట్స్

sri reddy sensational comments on film industry
Highlights

దర్శకనిర్మాతలు అవకాశాల పేరుతో హీరోయిన్లను ఎలా వాడుకుంటారనే విషయంపై సంచనల కామెంట్స్ చేసింది. నటులు, దర్శకనిర్మాతలు హీరోయిన్లను లాంగ్ డ్రైవ్ అని చెప్పి బయటకు తీసుకువెళ్లి కారులోనే పని కానిస్తున్నారని.. కారునే పడకగదిగా మారుస్తున్నారని విమర్శలు చేసింది

మొన్నటివరకు టాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ పై పడింది. అక్కడ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ లు పెట్టిన శ్రీరెడ్డి ఏకంగా చెన్నైకి వెళ్లి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఆమె కోలీవుడ్ తారలపై చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ అలానే కోశాధికారిగా పని చేస్తోన్న కార్తీ అన్నారు.

ఆధారాలు ఉంటే పోలీస్ కంప్లైంట్ చేయాలి కానీ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం ఏంటని కార్తీ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన శ్రీరెడ్డి.. తనను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించమని.. లాజిక్కులు మాట్లాడొద్దని కార్తీకి కౌంటర్ ఇచ్చింది. నడిగర్ సంఘం ఉన్నది.. సమస్యలు తీర్చాడడానికి కానీ ఉచిత సలహాలు ఇవ్వడానికి కాదు అంటూ ఫైర్  అయింది శ్రీరెడ్డి.

ఇది ఇలా ఉండగా.. తాజాగా దర్శకనిర్మాతలు అవకాశాల పేరుతో హీరోయిన్లను ఎలా వాడుకుంటారనే విషయంపై సంచనల కామెంట్స్ చేసింది. నటులు, దర్శకనిర్మాతలు హీరోయిన్లను లాంగ్ డ్రైవ్ అని చెప్పి బయటకు తీసుకువెళ్లి కారులోనే పని కానిస్తున్నారని.. కారునే పడకగదిగా మారుస్తున్నారని విమర్శలు చేసింది. విదేశాల్లో షూటింగ్ అని చెప్పి అక్కడ చేసే నిర్వాహకం కూడా ఇదేనంటూ చెప్పింది. తమ కోరికను తీర్చుకోవడం కోసం మేకప్ మ్యాన్ నుండి దర్శకనిర్మాతల వరకు అందరూ హీరోయిన్లను వాడుకుంటున్నారని తెలిపింది. 

loader