పవన్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు..నువ్వు గల్లీ లీడర్ కూడా కాలేవు : శ్రీరెడ్డి

First Published 17, Apr 2018, 11:33 AM IST
Sri reddy sensational comments again on pawan kalyan
Highlights

పవన్ నీకు ఒక్కడికేనా ఫ్యాన్స ఉండేది

పవర్ స్గార్ పవన్ కళ్యాణ్‌పై నటి శ్రీరెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది .బషీర్‌బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలతి పాటు శ్రీరెడ్డి కూడా పాల్గొంది. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ ..పవన్ కళ్యాణ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించింది .

పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్‌ని అదుపులో పెట్టుకోలేరా? అంటూ శ్రీ రెడ్డి ప్రశ్నించింది . పవన్ కళ్యాణ్ ఒక్కడికేనా ఫ్యాన్స్ ఉండేది..? మిగతావారికీ కూడా ఉన్నారని..పవన్ కళ్యాణ్ గల్లీ లీడర్ కూడా కాలేరని..ఎవరైనా నన్ను బూతులు తిట్టినా, పిచ్చి పిచ్చిగా మాట్లాడినా కచ్చితంగా మళ్లీ పాత శ్రీ బయటికొస్తుందని ఈ సందర్భంగా తెలిపింది.ప్రస్తుతం కొంతమంది స్క్రీన్ ముందు పతివ్రతలుగా.. ఇండస్ట్రీలో ఏమీ జరగట్లేదు చాలా మంచిదని చెప్పుకునే వారి జాతకాలు మా దగ్గరున్నాయ్. ఇవి ఎప్పటికైనా వెలుగులోకి వస్తాయి అని పేర్కొంది.

loader