నువ్వు జన ద్రోహివి.. పవన్ పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి

Sri reddy senational comments on pawan kalyan
Highlights

నువ్వు జన ద్రోహివి.. పవన్ పై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ట్విట్టర్ లో ట్వీట్ల మోత మోగిస్తున్నాడు. తనపై కుట్రలు చేస్తున్న మీడియా ఛానెళ్లు.. వాటి అధినేతలపై ట్వీట్ యుద్ధం సాగిస్తున్నాడు. గత నాలుగు రోజులుగా పలు ట్వీట్లు చేసిన పవన్ మంగళవారం ఉదయం మరిన్ని ఆసక్తికర ట్వీట్లు చేశారు. తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తానని ట్వీట్ చేసిన పవన్.. శ్రీరెడ్డిని చెల్లిగా సంభోదించడం గమనార్హం.టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌ ఉందంటూ ఆరోపించి సంచలనంగా మారిన శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీపై తన విమర్శల పర్వం కొనసాగిస్తోంది. ఫేస్‌బుక్ వేదికగా మెగాస్టార్ చిరంజీవిపై పదునైన విమర్శలు చేసిన శ్రీరెడ్డి.. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మరోసారి విరుచుకుపడింది. పవన్ రాజకీయ, సినీ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంపైనా ఘాటు విమర్శలు చేసింది.మిస్టర్.. ఏమిటీ ఈ మాయ.. పాచిపోయిన లడ్డులూ అన్నావు.. ఉత్తరం, దక్షిణం అన్నావు.. అవినీతి జరుగుతుందన్నావు.. నిరూపించమంటే నాకు తెలియదు, బయట అనుకుంటున్నారు చూసుకోండి అన్నావు..’ అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ ట్వీట్లను ఉద్దేశించి శ్రీరెడ్డి పోస్టు చేసింది.

పనిలో పనిగా పవన్ రాజకీయ అంశాలపై పదునైన విమర్శలు చేసింది. ‘నాకు కులం లేదూ అన్నావు.. మా రంగాను అన్యాయంగా చంపేశారు అన్నావు.. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నావు.. పెద్ద ఫార్సు చేశావు.. లెక్కలు తేలుస్తాను అన్నావు.. కమిటీలో దొంగల్ని పెట్టావు..’ అంటూ శ్రీరెడ్డి విరుచుకుపడింది.
‘మా అన్న చేసింది తప్పు అన్నావు.. అన్నను మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటాను అన్నావు.. నీకు గెలిచే సత్తా లేకపోయినా పెద్ద ఫోజు కొడుతూ మిమ్మల్ని నేనే గెలిపించాను అన్నావు..’ అంటూ పవన్‌ను శ్రీరెడ్డి విమర్శించింది.

పవన్ సినీ కెరీర్‌పైనా వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి.. ‘పవర్‌ను అనుకున్నావు.. ఎన్ని చెత్త ప్లాప్ సినిమాలో లెక్కేసుకో..’ అంది. పవన్ వ్యక్తిగత జీవితంపైన మరోసారి విమర్శలు చేసింది. ఆడోళ్లంటే ఆటబొమ్మలనకున్నావు, ఒకటికి మూడు చేసుకున్నావు అంటూ పవన్ వైవాహిక జీవితం గురించి ప్రస్తావించింది. పవన్‌కు నటన రాదనుకున్నానని, కానీ సినిమాల్లో రాకపోయినా.. బయట బాగానే నటించాడని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. ‘నీ అవసరాల కోసం అందర్నీ దగా చేశావు. చివరకు అమ్మకు కూడా బురద పూశావు. చేతగాక నీ నిజ రూపం బయటపెట్టుకున్నావు. నిన్నేమనాలి.. నువ్వు ఆంధ్రద్రోహివి, ప్రజా ద్రోహివి, జనద్రోహివి.. తెలుగుప్రజలు నిన్ను క్షమించరు’ అంటూ ఆమె విరుచుకుపడింది.

loader