సినిమా ఇండస్ట్రీలోని తెర వెనక బాగోతాలు బయటపెట్టేందుకు ఉద్యమం చేపట్టింది. దీనికి శ్రీరెడ్డి లీక్స్ అని పేరు పెట్టింది. టాలీవుడ్ మేనేజర్లు, పీఆర్వోలు, హీరోలు అమ్మాయిలను తెగ వాడేస్తున్నారని సంచలన విషయాలు చెప్పింది.ఈ క్రమంలోనే.. శ్రీరెడ్డి లీక్స్ రిలీజ్ స్టార్ట్ చేసింది. గతంలో దగ్గుపాటి అభిరామ్ ఫోటోలు లీక్ చేసి అందరికి దడ పుట్టించింది. 

అమ్మాయిలకు అండగా ఉంటానంటు అప్పుడు పెద్ద ఉద్యమాన్నే నడిపింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ను భూతులు తిట్టందో ఒక్కసారిగా ఉద్యమం నీరుగారిపోయింది.అప్పటి నుండి మీడియా శ్రీరెడ్డిని పక్కన పెట్టేసింది. ఎదో అప్పుడప్పుడు ఫేస్ బుక్ లైవ్ కి వచ్చి అది చేస్తా ఇది చేస్తానంటు చెప్పసాగింది.ఇప్పుడు మళ్లీ లీక్స్ స్టార్ట్ చేసింది. దగ్గుపాటి అభిరామ్ తనతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను ఉన్నట్టుండి ఇవాళ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. అంతే కాదండోయ్ అభయ్ రామ్ పిక్స్ పెట్టి "నా లైఫ్ లో విలన్ ఇతనే "అంటు పోస్ట్ చేసింది.