శ్రీరెడ్డి రోజురోజుకి కొత్త కొత్త పేర్లు తీస్తు ఇండస్ట్రీని మొత్తం షేక్ చేస్తోంది. ఇద్దరు పెద్ద డైరెక్టర్లు తనకు ఛాన్స్ ఇస్తా అని మోసం చేశారని వాళ్ల పేర్లని డైరెక్ట్ గా రివీల్ చేయకుండా వాళ్ల చేసిన సినిమాల గురించి హింట్ ఇచ్చిఇండస్ట్రీ కి పెద్ద షాక్ ఇచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. దీనిని ఎలా నిర్మూలించాలంటు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఈ విషయాన్ని తెలంగాణ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకోవాలి. కేసీఆర్ తెలిస్తే ఒకొక్కడి పళ్లు రాళ్లతాయి. ఆయన ఏదో బిజీ ఉండడం వల్ల ఆయన వరకు ఈ విషయం వెళ్లలేదు అని నేను భావిస్తున్నా అంటు చెప్పుకొచ్చింది. అలాగే ఈ విషయం  కవిత , కేటీఆర్ గారి దగ్గరకు వెళ్తే కేసు చాలా సీరియస్ అవుతుంది. ఒకొక్కరి తాట తీస్తారు అంటు తెలిపింది.

ఈ ప్రాబ్లమ్ ను ఇక్కడితో వదలను దీనిని నేషనల్ మీడియా వరకు తీసుకెళ్తా అంటు చెప్పుకొచ్చింది. నాకు ఏదో రెండు ఆఫర్లు ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అంటే మాత్రం కుదరదు. కాస్టింగ్ కౌచ్ నిర్మూలించడమే నా ధ్యేయం అంటు చెప్పుకొచ్చింది. నాలాగా ఏ ఆడపిల్లా ఇలా నలిగిపోవద్దనే నేను ఈ పోరటం చేస్తున్నా. నాకు అన్ని విధాల అందరు సపోర్ట్ చేస్తున్న వారందరికి ధన్యవాధాలు అంటు చెప్పుకొచ్చింది.