మా అసోసియేషన్ వాళ్లకు గట్టి స‌వాల్‌ విసిరిన శ్రీరెడ్డి

Sri reddy sawal to maa Association
Highlights

మా అసోసియేషన్ వాళ్లకు గట్టి స‌వాల్‌ విసిరిన శ్రీరెడ్డి

 టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ శ్రీరెడ్డి. రీసెంట్ గా ఒ డిబేట్ లో త‌న‌తో రాస‌లీల‌లు న‌డిపిన ఆ వ్య‌క్తి ఎవ‌రో కాద‌ని, టాలీవుడ్‌లో బ‌ఢా నిర్మాత‌గా ఓ వెలుగు వెలుగుతున్న సురేష్‌బాబు త‌న‌యుడు అభిరామ్ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అలా శ్రీ‌రెడ్డి ఒక్క‌సారిగా అభిరామ్ ఫోటోలు బ‌య‌ట‌పెట్ట‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. అవును, అభిరామ్ నాకు సినిమా అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని న‌మ్మించి… నన్ను శారీర‌కంగా వాడుకున్నాడు అంటూ మీడియా ముఖంగా చెప్పింది శ్రీ‌రెడ్డి.

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని పోరాటం చేస్తున్న నాకు మా అసోసియేష‌న్ స‌భ్య‌త్వం ర‌ద్దు చేసి.. సినీ ఇండ‌స్ర్టీ నుంచి వెలేస్తారా..?  ఇప్పుడు ప్ర‌ముఖ నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడి రాజ‌లీల‌లను ఆధారాల‌తో స‌హా  బ‌య‌ట‌పెట్టా క‌దా..!!  మా అసోసియేష‌న్‌కు ద‌మ్ముంటే ద‌గ్గుబాటి ఫ్యామిలీని సినీ ఇండ‌స్ర్టీ నుంచి వెలేయ‌గ‌ల‌దా..!  ద‌గ్గుబాటి అభిరామ్‌, అత‌న్ని ప్రోత్స‌హించిన ఆయ‌న తండ్రి, అండ‌గా నిలిచిన వెంక‌టేష్‌, రాణాల‌ను తెలుగు సినీ ఇండ‌స్ర్టీ నుంచి వెలేయ‌గ‌ల ద‌మ్ము మా అసోసియేషన్‌కు ఉందా..? అంటూ శ్రీ‌రెడ్డి ప్ర‌శ్నించింది.

loader