పరిటాలను పొగుడుతూ శ్రీరెడ్డి పోస్ట్.. పవన్ కు కౌంటరా..?

sri reddy post on paritala ravi
Highlights

కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారిపై ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి

కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వారిపై ఆరోపణలు చేసింది నటి శ్రీరెడ్డి. ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్లి అక్కడ తారలపై కూడా ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది.

ఓ పక్క సినిమా వాళ్లను తిడుతూనే మరోపక్క రాజకీయాలపై కూడా కామెంట్లు చేస్తుంది ఈ నటి. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వివాదాలకు దారి తీస్తోంది. 'బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా, నిజమైన హీరోరా పరిటాల రవి గారు. ఆయనే ఉండుంటే.. గడ్డంకి, జుట్టుకి పెయింటింగ్ లు వేసుకునేవాళ్లు సిఎం అవ్వకుండా కాపాడేవారు. గడ్డం పెంచుకుంటే, ప్రసంగాల్లో అరుస్తూ డైలాగ్స్ చెప్తే చెగువేరా అవుతారా..

నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయనా వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగుపోద్ది మీ పులి వేషం వేసుకున్న నక్కకి' అంటూ చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినట్లుగా ఉండడంతో ఆయన అభిమానులు మరోసారి శ్రీరెడ్డిపై విరుచుకుపడుతున్నారు.   
 

loader