MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jailer 2: రజినీకాంత్ మూవీ కోసం సంజూ శాంసన్ రచ్చ.. ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి ఏం చేశాడో తెలుసా?

Jailer 2: రజినీకాంత్ మూవీ కోసం సంజూ శాంసన్ రచ్చ.. ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి ఏం చేశాడో తెలుసా?

Jailer 2: సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ సినిమాను కుటుంబం, టీమిండియా సహచరులతో చూసేందుకు సంజూ శాంసన్ ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేశారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలోని 'జైలర్ 2', 2023లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ 'జైలర్' కు సీక్వెల్‌.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 20 2026, 03:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్‌స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని సంజూ శాంసన్
Image Credit : ANI/X

సూపర్‌స్టార్ రజినీకాంత్ కు వీరాభిమాని సంజూ శాంసన్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జాతీయ జట్టులో ఆయన స్థానంపై ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఆయన అద్భుతమైన ప్రతిభ ఉన్న ఆటగాడని అందరూ ఒప్పుకుంటారు. అలాంటి శాంసన్ స్వయంగా ఓ వ్యక్తికి తీవ్రమైన అభిమాని.

ఆ వ్యక్తే భారతీయ సినిమా రంగానికి చెందిన సూపర్‌స్టార్ రజినీకాంత్. రజినీకాంత్ అంటే సంజూ శాంసన్‌కు చాలా ఇష్టం. తలైవా కొత్త చిత్రం 'జైలర్ 2' ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా చూడటానికి సంజూ శాంసన్ చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన క్రేజీ ప్లాన్
Image Credit : ANI

ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన క్రేజీ ప్లాన్

రజినీకాంత్ తాజా చిత్రం 'జైలర్ 2' సినిమాను చూడటానికి సంజూ శాంసన్ ఏకంగా ఒక థియేటర్ స్క్రీన్ మొత్తాన్ని బుక్ చేశారు. తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, టీమిండియా సహచర ఆటగాళ్లతో కలిసి ప్రైవేట్‌గా సినిమా చూడాలనే ఆలోచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఒక ఈవెంట్ ఉండటం వల్ల సినిమా విడుదలైన రోజే చూడలేకపోయాక, మరుసటి రోజే ఏకంగా హాల్ మొత్తాన్ని రిజర్వ్ చేసుకున్నారు.

35
రజినీ సర్ సినిమా అంటే చాలు.. శాంసన్ కామెంట్స్ వైరల్
Image Credit : Getty

రజినీ సర్ సినిమా అంటే చాలు.. శాంసన్ కామెంట్స్ వైరల్

ఈ ప్రత్యేక స్క్రీనింగ్ సందర్భంగా సంజూ శాంసన్ మాట్లాడుతూ తలైవాపై ఉన్న తన ప్రేమాభిమానాలను పంచుకున్నారు. "నాకు రజినీ సర్ సినిమాలు చూడటం చాలా ఇష్టం. ఆయన కొత్త సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను. ఢిల్లీలో ఒక కార్యక్రమం ఉండటం వల్ల మొదటి రోజే సినిమా చూడలేకపోయాను. అందుకే ఒక రోజు ఆలస్యమైంది. కానీ ఈరోజు అదృష్టవశాత్తూ థియేటర్ మొత్తాన్ని బుక్ చేయగలిగాను. నా భార్య, స్నేహితులను ఆహ్వానించాను. రజినీ సర్‌ను బిగ్ స్క్రీన్‌పై చూడటానికి చాలా ఆసక్తిగా ఉన్నాను" అని వెల్లడించారు.

45
తమిళ్ తెలిసిన టీమిండియా ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం
Image Credit : Asianet News

తమిళ్ తెలిసిన టీమిండియా ఆటగాళ్లకు ప్రత్యేక ఆహ్వానం

కేవలం తన కుటుంబంతోనే కాకుండా టీమిండియా సభ్యులతో కలిసి ఈ సినిమాను చూడటానికి సంజూ ఏర్పాట్లు చేశారు. భారత జట్టులో తమిళ భాష తెలిసిన ప్రతీ ఒక్కరిని ఈ షోకు ఆహ్వానించినట్లు సంజూ తెలిపారు. "మా జట్టులో, సపోర్ట్ స్టాఫ్‌లో తమిళ భాష తెలిసిన ప్రతి ఒక్కరూ ఈ స్క్రీనింగ్‌కు వస్తున్నారు" అని చెప్పారు. దీనితో క్రికెట్ ప్లేయర్లు కూడా రజినీ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సంజూతో కలిసి ఆస్వాదించారు.

55
బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' హవా
Image Credit : Asianet News

బాక్సాఫీస్ వద్ద 'జైలర్ 2' హవా

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2', 2023లో వచ్చిన ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ 'జైలర్' మూవీకి సీక్వెల్‌గా వచ్చింది. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజినీకాంత్ మళ్లీ తన మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను మెప్పించారు. విడుదలై ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹478 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, ₹500 కోట్ల మైలురాయికి చేరువలో ఉంది. ఇండియాలో 5వ రోజు ₹42.35 కోట్ల నెట్ వసూలు చేసి, దేశీయంగా మొత్తం ₹242 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ చించిందేమీ లేదు, 1000 కోట్ల హీరో అని హైప్ ఇచ్చారు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Chiranjeevi: బాలయ్య బతికిపోయాడు, చిరంజీవి దెబ్బకి చిత్తైపోయిన వెంకటేష్‌.. 1997లో ఏం జరిగిందంటే?
Recommended image3
Crazy Kalyanam 4 Days Collections: క్రేజీ కళ్యాణం 4 రోజుల కలెక్షన్లు.. గట్టి పోటీలోనూ స్టడీగా వసూళ్లు
Related Stories
Recommended image1
iPhone 17: 99 వేల ఫోన్ కేవలం 55 వేలకే.. ఐఫోన్ 17 పై భారీ డిస్కౌంట్
Recommended image2
Samsung Galaxy F70 5G: అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరలోనే శాంసంగ్ కొత్త 5జీ ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved