నటి శ్రీరెడ్డి మరోసారి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తోంది. కోలివుడ్ లో సినిమా ఆఫర్లు వచ్చాయని చెన్నైకి వెళ్లిన ఈమె మళ్లీ హైదరాబాద్ కి తిరిగొచ్చింది. పోనీ ఇక్కడ ఏమైనా సైలెంట్ గా ఉందా అంటే అదీ లేదు.

గతంలో కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలపై ఆరోపణలు చేసిన ఈమె మరోసారి వారిపై విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే కొరటాల శివ, దగ్గుబాటి ఫ్యామిలీలపై విరుచుకుపడ్డ శ్రీరెడ్డి చనిపోయిన రామానాయుడిని కూడా వదలలేదు.

ఆయనకి అమ్మాయిల పిచ్చి అంటూ అసభ్యకర పదజాలంతో దూషించింది. గతంలో హీరో నానిపై ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి మరోసారి అతడిని టార్గెట్ చేసింది.

నాని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ''అయోమయం ఊరిలో ఉండే నానిగా ఇంట్లో పిల్లోడున్నాడు. సిగరెట్ ఆపావా లేదా..? నీకు పుడితే ఒకటి.. నాకు పుడితే ఒకటి కాదురా.. బాగా పెంచు వాడిని'' అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.

ఇప్పటికే ఒకసారి నాని.. శ్రీరెడ్డి పోస్ట్ లపై స్పందించి లీగల్ గా చర్యలు తీసుకుంటామని చెప్పాడు. మరి ఇప్పుడు శ్రీరెడ్డి తన కొడుకు జోలికి కూడా వస్తోంది. మరి నాని ఏం చేస్తాడో చూడాలి!