టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ నటి శ్రీరెడ్డి వివాదాలకు తెర లేపింది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ పోస్ట్ లు పెడుతూనే ఉంది. ఇప్పుడు తను చేసే రచ్చ బిగ్ బాస్ షోలో చేయడానికి సిద్ధమవుతుందని టాక్.

అయితే ఇక్కడ తెలుగు ప్రేక్షకులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీరెడ్డి తమిళ బిగ్ బాస్ కి వెళ్లబోతుందని టాక్. ప్రస్తుతం కోలివుడ్ లో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా శ్రీరెడ్డి తమిళనాడులో మకాం పెట్టింది. అప్పుడప్పుడూ హైదరాబాద్ వచ్చి వెళ్తున్నప్పటికీ తమిళ ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టింది. 

ఈ క్రమంలో ఆమెకి తమిళ బిగ్ బాస్ 3 లో పాల్గొనే ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. షో విషయానికొస్తే.. తమిళంలో ప్రస్తుతం బిగ్ బాస్ 3కి సన్నాహాలు జరుగుతున్నాయి. గత రెండు సీజన్ లకు కమల్ హాసన్ హోస్ట్ చేయగా.. మూడో సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేస్తున్నారు.

ఇక కంటెస్టంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి పేరు వినిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఆమె గనుక షోలోకి వెళ్తే.. పెద్ద రచ్చ జరగడం ఖాయమంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు మాత్రం దయచేసి శ్రీరెడ్డిని తీసుకురావొద్దంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.