నాగబాబు నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు : శ్రీరెడ్డి

First Published 22, Apr 2018, 4:07 PM IST
Sri reddy getting threat calls from mega family members
Highlights

నాకు ఏమైన జరిగితే దానికి కారణం మొగా ఫ్యామిలీదే

సంచలనాలకు మారు పేరుగా మారిన నటి శ్రీరెడ్డి మళ్లీ తన రచ్చ మొదలుపెట్టింది. ఇటీవల జరిగిన ఘటన తరువాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆరోపించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు తనకు కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ట్విట్టర్ వేదికగా భయాందోళన వ్యక్తం చేసింది. ‘నాకు చాలా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో నాగబాబు దగ్గర నుంచి ఎక్కువగా వస్తున్నాయి. నాకు ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మెగా ఫ్యామిలీదే. ఇది స్వయంగా నా స్వహస్తాలతో రాస్తున్న నా వాంగ్మూలం’’ అంటూ ట్విట్టర్ లో పేర్కొంది. 

loader